బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి అందరికీ సుపరిచితమే అయితే ప్రస్తుతం ఈమె అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్ నువివాహం చేసుకొని అమెరికాలోని స్థిరపడ్డారు.అయితే చాలా సంవత్సరాల తర్వాత తిరిగి ఇండియా వచ్చినటువంటి ఈమె ప్రస్తుత ముంబైలో పలు ఈవెంట్లకు హాజరవుతూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ప్రియాంక చోప్రా కెరియర్ మొదట్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలియజేస్తూ ఇండియన్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కెరియర్ మొదట్లో ఇండస్ట్రీలో తాను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని కొందరైతే తనకు ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా తొక్కేయాలని చూశారంటూ ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక ఇండియాలో ఒక వ్యక్తి విజయం సాధించి మంచి స్థాయిలో ఉంటే కుళ్ళు కునేవారు అధికంగా ఉంటారు.ఇతరుల విజయాన్ని ఇండియాలో ఓర్చుకోలేరని, ఇండియాలోని జనాలకు కుళ్ళు ఎక్కువ అంటూ ఈ సందర్భంగా ఈమె ఇండియన్స్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి.

ఈ క్రమంలోనే ప్రియాంక చోప్రా చేస్తున్న ఈ వ్యాఖ్యలపై పలువురు స్పందిస్తూ నీవు ఇండియాలోనే సినిమాలలో నటించి ఇంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ప్రస్తుతం విదేశీ వ్యక్తిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నీకు ఫుడ్ పెట్టిన ఇండియా గురించి ఇలా మాట్లాడటం సబబు కాదు.ప్రతి ఒక్క దేశంలోనూ మంచి చెడు కలిగినటువంటి వారు ఉంటారు.ఇలా లైఫ్ ఇచ్చిన దేశంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అంటూ పెద్ద ఎత్తున నటి ప్రియాంక చోప్రా పై నేటిజన్ లు మండిపడుతూ తనని ట్రోల్ చేస్తున్నారు.