తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ నేడు కొడంగల్ రోడ్ షోలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై మండిపడ్డారు.
కొడంగల్ ప్రజలను ఉద్దేశించి జనంలో ఉండే ఎమ్మెల్యే కావాలా.? జైలుకుపోయే దొంగ కావాలా.? అని కేటీఆర్ ప్రశ్నించారు.గత 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిన కొడంగల్ లో ఏనాడు జరగని అభివృద్ధిని నరేందర్ రెడ్డి ఐదేళ్లలో చేసి చూపించారు.కొడంగల్ కి డిగ్రీ కాలేజ్, దౌల్తాబాద్ కు జూనియర్ కాలేజ్, కోస్గిలో, మద్దుర్ లో.50 పడకల ఆసుపత్రి ఇంకొక 50 కొడకలు ఆసుపత్రి 30 పడకల ఆసుపత్రి నరేందర్ రెడ్డి తీసుకురావడం జరిగింది.కొడంగల్ లో సర్పంచ్ లు, ఎంపీటీసీలు, లీడర్లను కొంటున్నా రేవంత్ ప్రజలను కొనలేదని చెప్పుకొచ్చారు.కొడంగల్ నియోజకవర్గం లో మరోసారి నరేందర్ రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్.కాళ్లు పట్టుకుని అయినా సరే మంత్రి పదవి ఇస్తానని కొడంగల్ ప్రజలకు కేటీఆర్ హామీ ఇచ్చారు.
ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటిని అందిస్తామని అన్నారు.కేసీఆర్ కి సవాలు విసురుతున్న రేవంత్ రెడ్డిని చూస్తుంటే.తెగ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడకొడుతున్నట్లు ఉంది.
గతంలో కొడంగల్ పేరును రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో నాశనం చేశాడు.రేవంత్ రెడ్డి ఎగురుడు, దుంకుడుకు ఎక్కువ రోజులు పట్టదని త్వరలోనే మళ్లీ చిప్పకూడు తింటాడని.
కేటీఆర్ జోస్యం చెప్పడం జరిగింది.కచ్చితంగా మూడోసారి కూడా కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో కొడంగల్ సభ ముగిసిన అనంతరం.భారీ ఎత్తున జన సందోహం రావడంతో కేటీఆర్ ట్విట్టర్ లో సంతోషం వ్యక్తం చేశారు.
మరోసారి కొడంగల్ లో విజయం సాధిస్తామని.కొడంగల్ ప్రజలు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు.