ఏకంగా బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన పెళ్లి సందడి బ్యూటీ.. లక్ మాములుగా లేదుగా..

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు.ఈమె చేసింది ఒక్క సినిమా అయినప్పటికీ ఈమె మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయిందనే చెప్పాలి.

 Tollywood Actress Sree Leela Got Bollywood Offer, Sree Leela, Bollywood Offer, P-TeluguStop.com

ఈమె అందం, అభినయం అన్ని కూడా ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తాయి.శ్రీలీల రాఘవేంద్రరావు పర్వేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్లి సందడి సినిమా ద్వారా వెండి తెరమీద అడుగు పెట్టింది.

ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించాడు.ఈ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది.ఈ సినిమా తర్వాత శ్రీలీల వరుస అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ లో దూసుకు పోతుంది.ఈమె ఆఫర్స్ వచ్చే కొద్దీ రేటు కూడా భారీగా పెంచుకుంటూ పోతుంది.

ప్రెసెంట్ ఈమె రవితేజ ధమాకా సినిమాలో నటిస్తుంది.

Telugu Bollywood, Dhamaka, Nithin, Pelli Sandadi, Prabhas, Sree Leela, Sreeleela

అలాగే నితిన్ కొత్త సినిమాలో ఈ అమ్మడిని హీరోయిన్ గా తీసుకున్నారు.రైటర్ వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నితిన్ కు జోడీగా శ్రీలీల నటిస్తుంది.ఈ సినిమాను ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై నికిత రెడ్డి, సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

ఈ సినిమా త్వరలోనే రెగ్యురల్ షూటింగ్ షురూ చేయనుంది.అలాగే మహేష్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కే సినిమాలో కూడా ఈమె సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

అలాగే ప్రభాస్, మారుతి కాంబోలో తెరకెక్కే సినిమాలో కూడా ఆఫర్ అందుకునట్టు టాక్ వినిపిస్తుంది.అయితే ఇప్పుడు ఈ అమ్మడి ఖాతాలో ఏకంగా బాలీవుడ్ ఆఫర్ వచ్చిపడినట్టు వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్ డైరెక్టర్ సినిమాలో యంగ్ బ్యూటీ కోసం వెతుకుతుండగా ఈమెపై వారి ద్రుష్టి పడిందట.ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు కూడా జరిగాయని తెలుస్తుంది.

ఈ సినిమా గురించిన ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube