తణుకు బహిరంగ సభలో వైసీపీ మంత్రులపై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!

తణుకు “ప్రజాగళం”( Tanuku Praja Galam ) సభలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పవన్.

 Pawan Kalyan Serious Comments On Ycp Ministers In Tanuku Public Meeting, Pawan K-TeluguStop.com

వైసీపీ మంత్రులపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.రైతులను ఏడిపించిన వైసీపీ ప్రభుత్వం తుడుచుకుపెట్టుకోవాలని అన్నారు.

ఇక్కడ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉన్నారని… ఓ రైతు ధాన్యం తడిచిపోయింది అని అడిగితే ఆ మంత్రి ఎంతో చీత్కారంగా మాట్లాడారు.ఈ ఎన్నికలతో ఆ మంత్రి సర్వం తుడిచిపెట్టుకుపోవాలని అన్నారు.

బూతులు తిట్టి, దాడులు చేసే మంత్రులు వైసీపీ క్యాబినెట్ లో ఉన్నారు.దోపిడీపై దృష్టి ఉన్న నేతలు ప్రజల అవసరాలు ఎలా తీరుస్తారు.? ఇక్కడ దోచుకున్న సొమ్ముతో మరోచోట పరిశ్రమలు పెడుతున్నారు.టీడిఆర్ బాండ్ల పేరు( TDR Bonds )తో డబ్బులు దోచుకున్నారని ఆరోపించారు.

పదేళ్లుగా పార్టీ పెట్టి యువత భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను.

Telugu Chandrababu, Janasena, Pawan Kalyan, Praja Galam, Tanuku Public, Ycp Mini

మరోవైపు 2047 నాటికి దేశం భవిష్యత్తు ఇలా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ( PM Narendra Modi ) కోరుకుంటున్నారు.ఇక బలమైన నాయకుడు ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి, 90వ దశకం చివరిలో విజన్ 2020 పేరిట ఒక సైబరాబాద్ లాంటి నగరాన్ని చంద్రబాబు( Chandrababu Naidu ) నిర్మించారు.ఈరోజు అదేనగరం తెలంగాణ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుంది.

పార్టీలు కలిసి ఉండాలి లేకపోతే రాష్ట్రం అన్యాయం అయిపోతుందని 2014 నుంచి చెబుతున్నాం.పోలవరం పూర్తయిందా అంటే దానికి సంబంధించిన ఇరిగేషన్ మంత్రి.

డాన్స్ వేసే పరిస్థితి నెలకొంది.కానీ మీ కోసం మేమంతా ఉన్నాం.

చంద్రబాబు గారు నేను ఎంతో తగ్గాం.ముఖ్యంగా జనసేన పార్టీ ఎంతో తగ్గింది.

తణుకులో జనసేన పార్టీ( Janasena Party ) అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా మేము తగ్గాల్సి వచ్చింది.కారణం ఓటు చీకకూడదన్నదే.

ప్రధాన కారణం.మా అన్నయ్య నాగబాబు అనకాపల్లి సీటును కూడా వదులుకున్నారు.

Telugu Chandrababu, Janasena, Pawan Kalyan, Praja Galam, Tanuku Public, Ycp Mini

ఇదంతా ఆడబిడ్డల భద్రత కోసం, రైతుల క్షేమం కోసం కనీస వైద్య సదుపాయాల కోసం అని వ్యాఖ్యానించారు.చంద్రబాబుతో ప్రధాని మోదీతో.సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ కూటమిని తీసుకొచ్చాం.నాకు అధికారం లేకపోయినా చంద్రబాబుకు అధికారం లేకపోయినా మాకు ఎలాంటి నష్టం ఉండదు.కానీ జగన్( YS Jagan ) ఐదేళ్లపాటు డీఎస్సీ ఇవ్వలేదు.అలాంటి పాలకుల అధికారంలో ఉంటే ఎవరికి భవిష్యత్తు ఉండదు అంటూ పవన్ కళ్యాణ్ తణుకు సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube