పవన్ పుట్టిన రోజు వరుసగా విడుదల అయిన అప్‌డేట్స్‌తో పవన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.వకీల్‌సాబ్ మోషన్ పోస్టర్, సురేందర్ రెడ్డి సినిమా అనౌన్స్‌మెంట్, క్రిష్ సినిమా ప్రీ లుక్, హరీష్ శంకర్ సినిమా ఫస్ట్ లుక్ వరుసగా వచ్చేశాయి.2021లో ఈ ప్రాజెక్టులన్ని వరుసగా లైన్లో ఉంటాయి.దీంతో పవన్ ఫ్యాన్స్ ఆరే సాంబ రాస్కోరా 2021 పవన్ నామ సంవత్సరం అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు.ఇక పవన్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
2011లో వీరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్‌సింగ్ సినిమా పదేళ్ల తర్వాత పవన్‌కు బంపర్ హిట్ ఇచ్చింది.ఆ సినిమా తర్వాతే పవన్‌కు మాంచి ఊపు వచ్చిందనే చెప్పాలి.అప్పటి నుంచి మళ్లీ పవన్ – హరీష్ కలిసి పనిచేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సాధ్యం కావడం లేదు.
ఇక ఇప్పుడు మళ్లీ పవన్ – హరీష్ కాంబినేషన్ సెట్ కావడంతో పాటు అఫీషియల్‌గా ఎనౌన్స్‌మెంట్ కూడా రావడంతో మరోసారి అది గబ్బర్‌సింగ్ 2 రేంజ్‌లో ఉంటుందని లెక్కల్లో మనిగి తేలుతున్నారు.
ఇక ఈ క్రేజీ కాంబినేషన్లో పవన్ పక్కన హీరోయిన్‌గా పూజా హెగ్డే పేరు దాదాపు ఖరారైంది.
ఏమన్నా రెమ్యునరేషన్లలో తేడాలు వస్తే మినహా ఆమెనే పవన్ పక్కన రొమాన్స్‌కు రెడీ అయిపోయినట్టే.! పూజ ఇప్పటికే తెలుగులో తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతోంది.
బన్నీ, ఎన్టీఆర్, మహేష్‌కు ఆమె సూపర్ హిట్లు ఇచ్చింది.ఇటు హరీష్ శంకర్ గద్దలకొండ గణేష్‌లో కూడా నటించింది.
ఈ సెంటిమెంట్లతోనే ఆమెనే పవన్ పక్కన ఫిక్స్ చేశారట.ఒక్క రెమ్యునరేషన్ మాత్రమే తేలలేదని.
అది కూడా ఓకే అయితే పవన్ – పూజ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ చూసేందుకు రెడీ అయిపోవాల్సిందే.!
.