తెలంగాణ లో నరేంద్ర మోడీ మీటింగ్ కి పవన్ కళ్యాణ్..ఎన్నికల ప్రచారం లో కూడా పాల్గొనబోతున్నాడా?

తెలంగాణ లో ఈ నెల 30 వ తారీఖున అసెంబ్లీ ఎన్నికలు( Assembly Elections ) జరగబోతున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం అందుతున్న సర్వేల ప్రకారం బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీల మధ్యనే ప్రధాన పోరు ఉంటుందని తేలిపోయింది.

 Pawan Kalyan Participating In Pm Narendra Modi Telangana Meeting Details, Pawan-TeluguStop.com

బీజేపీ పార్టీ( BJP ) ప్రభావం అంతంత మాత్రమే , కేవలం 8 నుండి 10 స్థానాలు మాత్రమే గెలుచుకునే అవకాశం.రీసెంట్ గా పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) జనసేన పార్టీ కూడా బీజేపీ కి తోడు అయ్యింది.

ఆ పార్టీ వల్ల, పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చెయ్యడం వల్ల అదనంగా మరో రెండు మూడు సీట్లు రావొచ్చు.అందుకే పవన్ కళ్యాణ్ ని ఎన్నికల ప్రచారం చేయించడం కోసం బీజేపీ పార్టీ తెగ ప్రయత్నాలు చేస్తుంది.

ఒంటరిగా 34 స్థానాల్లో పోటీ చెయ్యడానికి సిద్దమైన జనసేన పార్టీ ని,( Janasena ) బీజేపీ పార్టీ తెలంగాణ అద్యక్ష్యుడు కిషన్ రెడ్డి చర్చల ద్వారా ఆపించేసాడు.అనంతరం పవన్ కళ్యాణ్ ని ఢిల్లీ కి తీసుకెళ్లి అమిత్ షా తో( Amit Shah ) మీటింగ్ జరిపి పొత్తు ఖరారు చేయించాడు.

కాసేపటి క్రితమే బీజేపీ పార్టీ మూడవ విడత ఎమ్యెల్యే అభ్యర్థుల జాబితా ని విడుదల చేసారు.పవన్ కల్యాజ్ ఇటలీ టూర్ నుండి తిరిగి రాగానే తుది చర్చలు జరిపి జనసేన పోటీ చెయ్యబొయ్యే స్థానాల గురించి అధికారిక ప్రకటన విడుదల చెయ్యబోతున్నారు.

Telugu Amit Shah, Janasena, Janasenabjp, Pawan Kalyan, Pm Modi, Telangana-Telugu

అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జనసేన పార్టీ 9 నుండి 12 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.అంతే కాదు ఈ నెల మొత్తం పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కూడా చెయ్యబోతున్నాడు అట.మరి పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన ప్రసంగాలు ఇస్తాడా?, కేసీఆర్ మరియు కేటీఆర్ తో పవన్ కళ్యాణ్ కి మంచి సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా కేటీఆర్( KTR ) ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.ఇంత మంచి బాండింగ్ ని చెడుపుకునే విధంగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తాడో లేదో చూడాలి.

Telugu Amit Shah, Janasena, Janasenabjp, Pawan Kalyan, Pm Modi, Telangana-Telugu

ఇదంతా పక్కన పెడితే అతి త్వరలోనే తెలంగాణ ప్రాంతం లో బీజేపీ పార్టీ ఒక మహా సభ ని నిర్వహించనుంది.ఈ సభ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ( PM Modi ) నేతృత్వం లో జరగబోతుంది.ఈ సభకి పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనబోతున్నట్టు సమాచారం.ఈ సభ తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రం కూడా మారిపోతుందని అని అనుకుంటున్నారు.2014 తర్వాత పవన్ కళ్యాణ్ మరియు నరేంద్ర మోడీ అనేక సార్లు కలిశారు కానీ, పబ్లిక్ మీటింగ్స్ లో ఒక్కసారి కూడా పాల్గొనలేదు.మళ్ళీ ఇన్నాళ్లకు ప్రధానమంత్రి తో వేదికని పంచుకోబోతున్నాడు పవన్ కళ్యాణ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube