Pawan Kalyan : రాజోలు నియోజకవర్గంలో మరోసారి జనసేన గెలవాలి పవన్ కీలక వ్యాఖ్యలు..!!

జనసేన పార్టీ( Janasena Party ) 2014లో స్థాపించబడింది.ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో టీడీపీ.బీజేపీ పార్టీలకు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మద్దతు ప్రకటించారు.2014 ఎన్నికలలో జనసేన పోటీ చేయలేదు.కానీ 2019 ఎన్నికలలో బీఎస్పీ.వామపక్ష పార్టీలతో కలిసి మొదటిసారి పోటీ చేయటం జరిగింది.దాదాపు 100కు పైగా స్థానాలలో పోటీ చేస్తే కేవలం ఒక స్థానం మాత్రమే గెలిచింది.అది కూడా రాజోలు నియోజకవర్గంలో( Rajolu Constituency ) జనసేన పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాద్( Rapaka Varaprasad ) గెలిచారు.

 Pawan Kalyan Key Comments For Janasena To Win Once Again In Rajolu Constituency-TeluguStop.com

రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోయారు.ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి తెలుగుదేశం-జనసేన-బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి.

ఈసారి ఎన్నికలలో ఎలాగైనా గెలిచే అసెంబ్లీలో అడుగు పెట్టాలని పవన్ భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే బుధవారం మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో రాజోలు జనసేన నియోజకవర్గ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎన్నికలలో మరోసారి రాజోలు నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు.

గత ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపించిన ఆ నియోజకవర్గ ఓటర్లు నాడు చూపించిన ఆదరణ మరోసారి పార్టీ నాయకులు పొందుకోవాలని పేర్కొన్నారు.రాజోలు ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని మాట ఇచ్చారు.

ఈ సమావేశంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ పాల్గొన్నారు.రాజోలు నియోజకవర్గ పరిస్థితులపై చర్చించడం జరిగింది.

సార్వత్రిక ఎన్నికల్లో ప్రణాళిక బద్ధంగా అనుసరించాల్సిన విధానాలపై రాజోలు జనసేన కేడర్ కి పవన్ పలు సూచనలు చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube