పి.గన్నవరంలో పవన్ కళ్యాణ్ “వారాహి విజయభేరి” యాత్ర నిర్వహించారు.
గురువారం నిర్వహించిన ఈ ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు( Chandrababu ) కూడా పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )మాట్లాడుతూ.
తాను మామూలుగా 5000 జీతంతో ఉద్యోగం చేసుకుంటూ బతకాలని భావించినట్లు పేర్కొన్నారు.కానీ తన అన్నయ్య చిరంజీవి బాధ్యత తీసుకొని మార్షల్ ఆర్ట్స్, నటన అనే స్కిల్స్ నేర్పించడం వల్లే ఇవాళ తాను ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నట్లు స్పష్టం చేశారు.
ఆ రకంగా యాక్టింగ్ స్కిల్ మా అన్న నేర్పిస్తే ఆ విద్య నాకు ఒక్కడికే ఉపయోగించుకోలేదు.దాని మూలంగా వచ్చిన లాభాలను సమాజానికి పంచి పెట్టగలిగాను.కొన్ని వేలాదిమంది కౌలు రైతులకు మూడు నాలుగు సినిమాలు చేసి వచ్చిన డబ్బును… అందజేసి అండగా నిలబడ్డా.చిరంజీవి ( Chiranjeevi )గారి అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడికి.
చిన్న స్కిల్ నేర్పిస్తే.అది కొన్ని కోట్ల మంది ముందు నిలబెట్టే స్థితికి తీసుకొచ్చింది.
స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లు ఏర్పాటు చేస్తే.యువత సొంతంగా సంపాదించుకుంటారు.
అందుకే యువత నైపుణ్యాలు మెరుగుపరిచేలా కష్టపడుతున్నాం.సంక్షేమ పథకాలు ఏవి ఆపం.మరో పది రూపాయలు ఎక్కువే ఇస్తాం.అని పవన్ కళ్యాణ్ సంచలన స్పీచ్ ఇచ్చారు.