ఏ దర్శకుడికైనా తను తీసే సినిమాలను బట్టి ఒక జోనర్ అని ఫిక్స్ అవుతుంటారు ప్రేక్షకులు.అలాగే అనిల్ రావిపూడి( Anil ravipudi ) పేరు చెప్పగానే ఎవరికైనా కూడా ఏం గుర్తొస్తుంది చెప్పండి.
మంచి కమర్షియల్ సినిమాలలో తనదైన కామెడీని జోప్పించి అద్భుతమైన విజయాలను దక్కించుకోవడం గురించి ఎవరైనా చెబుతారు.ఆయన తీసిన మొదటి చిత్రం పటాస్ నుంచి F2, రాజాది గ్రేట్( Raja The Great ) వరకు సినిమా కమర్షియల్ యాంగిల్ ఏ మాత్రం మిస్ అవ్వదు.
అలాగే మహేష్ బాబు లాంటి స్టార్ హీరోని పెట్టి కూడా తన కామెడీని వదిలి పెట్టలేదు అనిల్ రావిపూడి.మహేష్ లాంటి ఒక క్యూట్ అండ్ స్మార్ట్ హీరో దగ్గర నుంచి కూడా కామెడీ వస్తుంటే కడుపుబ్బ నవ్వారు ప్రేక్షకులు.
తన సినిమాలో నటించే అందరూ నటీనటుల నుంచి కూడా కడుపు బండ పెంచే పంచ్ డైలాగులు వచ్చేలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు అనిల్.అందుకే అతనికి ఒక కామెడీ స్టార్ డైరెక్టర్ అంటారు.అయితే ఇప్పుడు ఆ ముద్ర నుంచి బయటకు రావాలని చూస్తున్నారట అనిల్.ఇప్పటి వరకు మీరు చూసింది లేరు ఇకపై మీరు చూసేది వేరు కొత్త ట్రెండ్ సృష్టించబోతున్నాను అంటూ చెబుతున్నారు.
భగవంత్ కేసరి సినిమా( Bhagavanth Kesari )తోనే తనలోని దర్శకుడికి పని చెప్పారు అప్పటి వరకు తీసిన సినిమాలకు ఈ సినిమాకి చాలా తేడా ఉంటుంది.ఈ సినిమాతోనే తను కామెడీ కాకుండా యాక్షన్ సినిమాలను కూడా తీయగలను అని నిరూపించుకున్నారు.
ఇప్పుడు అనిల్ రావిపూడి ప్రకటించిన తన తదుపరి సినిమా కూడా మునుపటి సినిమాలకు చాలా భిన్నమైన కథను ఎంచుకున్నారు.ఇప్పటి వరకు వెంకటేష్ తో రెండు సినిమాలు తీసిన అనిల్ రావిపూడి తమ కాంబినేషన్ నీ కంటిన్యూ చేస్తూనే కామెడీకి కాస్త సీరియస్ టచ్ ఇచ్చారు.వెంకటేష్ మాజీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారట.మరి క్రైమ్ కామెడీ సినిమా కి కెప్టెన్ అనే పేరును సినిమా కూడా కన్ఫర్మ్ చేశారు.ఈ సినిమా విడుదలయ్యాక అనిల్ రావిపూడి ఏమాత్రం ప్రయోగాలు చేశాడో తెలుసుకోవచ్చు.