యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓమ్ రౌత్( Om Rauth ) దర్శకత్వంలో హిందీ మరియు తెలుగు లో రూపొందిన ఆదిపురుష్ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది.జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆదిపురుష్( Adipurush ) సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తం ఖరారు అయ్యిందనే విషయం తెల్సిందే.
తిరుపతిలో ఆదిపురుష్ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జూన్ 6వ తారీకున నిర్వహించబోతున్న విషయం తెల్సిందే.ఈ మెగా ఈవెంట్ కు ఎవరు ముఖ్య అతిథులుగా హాజరు అవ్వబోతున్నారు అనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
బాలీవుడ్ నుండి టాలీవుడ్ కోలీవుడ్ వరకు ఎంతో మంది స్టార్స్ వస్తారనే చర్చ జోరుగా సాగుతోంది.
వివరాల్లోకి వెళ్తే చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ యొక్క గెస్ట్ ల గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.
తెలుగు రాష్ట్రాల నుండి తిరుపతి ఈవెంట్ కు భారీ ఎత్తున జనాలు హాజరు అయ్యే అవకాశాలు ఉన్నందున అందుకు తగ్గట్లుగా నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.విజువల్ వండర్ గా రూపొందిన ఆదిపురుష్ సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకోవడం ఖాయం అంటూ అభిమానులు నమ్మకంగా ఉన్నారు.
ఆ అంచనాలకు తగ్గితే ప్రమోషన్ వీడియోస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయ్.
ఆదిపురుష్.మొన్నటి వరకు కంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ చిత్రంపై ఇప్పుడు కనీవినీ ఎరుగని రీతిలో అంచనాలు ఏర్పడ్డాయి.కారణం ట్రైలర్, ఫస్ట్ సింగిల్ రిలీజ్ తర్వాత ఎక్కడా లేని హైప్ ఆదిపురుష్ కు వచ్చేసింది.2023లో మోస్ట్ అవెయిటెడ్ మూవీగా ఉన్న ఈ చిత్రం జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించారు.
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) రావణుడిగా చేశాడు.రామాయణ కావ్యం మొత్తం కాకుండా కేవలం సీతాపహరణం ఎపిసోడ్ ను మాత్రమే ఆదిపురుష్‌లో ప్రస్తావించబోతున్నారు.
ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి.
సౌత్ తో పాటు నార్త్ ఇండియా లోనూ ఆదిపురుష్ ను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు.ఆల్రెడీ జూన్ 6న తేదీన తిరుపతిలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు.అలాగే హిందీలో సినిమాను జన్నాల్లోకి తీసుకెళ్లడం కోసం ముంబైలోనూ ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పటు చేయబోతున్నారు.
ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ ఎవరో తెలిస్తే షాకైపోతారు.ఆదిపురుష్‌పై భారీ హైప్ పెంచడానికి మేకర్స్ నయా స్కెచ్ తో భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని( Narendra Modi ) ఆహ్వానించారట.
వీలు చిక్కితే తప్పకుండా వస్తానని మోడీ మాట కూడా ఇచ్చారట.ఒకవేళ నిజంగా ఈ ఈవెంట్ కు మోడీ వస్తే.ఆదిపురుష్ పై అంచనాలు తారా స్థాయికి చేరుకోవడం ఖాయమవుతుంది.ఇదిలా ఉండగా మన టాలీవుడ్ నుండు పవన్ కళ్యాణ్ కి కూడా ఇన్విటేషన్ అందింది అని సమాచారం, తిరుపతిలో జరిగే ఆదిపురుష్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ మెయిన్ గెస్ట్ అయితే బాగుంటుంది అని మేకర్స్ ప్రభాస్ కి సూచించారట , దానికి ప్రభాస్ కూడా సానుకూలంగా స్పందించారని టాలీవుడ్ లో ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది, అదే గనక జరిగితే ఫాన్స్ కి ఇక పండగే , ఆదిపురుష్ రికార్డులు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తుంది….