ఒకప్పుడు పాపులర్ అవ్వడం, సెలబ్రెటీగా మారడమంటే చాలా కష్టంగా ఉండేది.మనలోని టాలెంట్‌ను ప్రపంచానికి తెలియజేయాలంటే చాలా రోజులు పట్టేది.
కానీ ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ పని బాగా సులువుగా మారింది.ఎవరైనా సరే క్షణాల్లో సోషల్ మీడియలో రాత్రికి రాత్రి సెలబ్రెటీగా మారిపోతున్నారు.
తమలోని టాలెంట్‌ను ప్రపంచం మొత్తానికి తెలియచేస్తూ పాపులర్ అయిపోతున్నారు.ఇలా సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది సెలబ్రెటీలుగా మారిపోతున్నారు.
తాజాగా సోషల్ మీడియాలో ఒక మహిళకు సంబంధించి వీడియో దుమ్మురేపుతోంది.ఈ వీడియోలో ఒక మహిళ చీరకట్టులో సన్‌గ్లాసెస్ పెట్టుకుని పాస్ సాంగ్‌కు అదిరిపోయేలా డ్యాన్స్( Dance ) వేసింది.చూడటానికి చాలా వయస్సు ఉన్న మహిళలా ఉంది.కానీ ఆమె డ్యాన్స్ చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు.మైఖేల్ జాక్సన్ చెల్లిగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.సాంప్రదాయ చీర కట్టుకుని( Traditional Saree ) మంచి స్ట్రైలిస్ సన్‌గ్లాసెస్( Sunglasses ) పెట్టుకుని యువతిగా డ్యాన్స్‌తో అదరగట్టిన తన టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది ఈ మహిళ.
ఈ మహిళ డ్యాన్స్‌ను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఏజెంట్ తినా ఆఫీషియల్ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు.మహిళ తన డ్యాన్స్‌ను అదరగొట్టడంతో సోషల్ మీడియాను ఈ వీడియో షేక్ చేస్తోంది.ఆమె డ్యాన్స్ నుంచి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.త్వరలోనే ఈమె సెలబ్రెటీ అవుతుందంటూ కామెంట్ చేస్తోన్నారు.వయస్సు అనేది శరీరానికి మాత్రమేనని, టాలెంట్‌తో సంబంధం లేదని చెబుతున్నారు.
ఈ మహిళ వీడియోకు లక్షల్లో లైక్‌లు, షేర్లు వస్తోన్నాయి.అయితే ఇటీవల సోషల్ మీడియాలో మహిళలు తమ టాలెంట్‌ను బయటపడుతున్నారు.
పాటలతో, డ్యాన్సులతో మైమరిపిస్తున్నారు.ఈ వీడియోలు ఎంతోమందిని ఆకట్టుకుంటున్నాయి.సోషల్ మీడియాలో వెంటనే ఇలాంటివి వైరల్ గా మారుతున్నాయి.