పవన్ కళ్యాణ్ మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ లో నటిస్తున్నాడు.రానా తో కలిసి నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల సినిమాటోగ్రాఫర్ వివాదం కారణంగా రెండు వారాల పాటు నిలిచి పోయిన విషయం తెల్సిందే.
ఎట్టకేలకు సినిమా షూటింగ్ పునః ప్రారంభం అయ్యింది.సినిమా షూటింగ్ ను మొదలు పెట్టిన నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు కీలక విషయాన్ని క్లారిటీ ఇచ్చారు.
సినిమాటోగ్రాఫర్ తప్పుకోవడంతో ఆయన చిత్రీకరించిన సన్నివేశాలన్నింటిని కూడా మళ్లీ చిత్రీకరించాలని భావిస్తున్నారన ఆయన కు క్రెడిట్ ఇచ్చేందుకు దర్శకుడు సాగర్ చంద్ర ఇష్టపడటం లేదని అందుకే ఆయన పేరు టైటిల్ కార్డ్స్ లో లేకుండా ఉండాలంటే ఆయన తో చిత్రీకరించిన సన్నివేశాలు పూర్తిగా తొలగించి మళ్లీ కొత్తగా తొలగించాల్సి ఉందని యూనిట్ సభ్యులు అనుకున్నారు అంటూ వార్తలు వచ్చాయి.కాని ఆ వార్తలు నిజం కాదని తేలిపోయింది.
ఈ సినిమా షూటింగ్ పునః ప్రారంభం అయిన నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు పవన్ స్టిల్ ను విడుదల చేయడం జరిగింది.దాంతో పాటు సినిమా ను వచ్చే నెలలో ముగించబోతున్నట్లుగా కూడా పేర్కొన్నారు.
దాంతో సినిమా షూటింగ్ కు సంబంధించినంత వరకు మీడియాలో వచ్చిన వార్తలు నిజం కాదని తేలిపోయింది.ఇంతకు ముందు చిత్రీరించిన సన్నివేశాలు అలాగే ఉంచబోతున్నారు.సినిమాటోగ్రాఫర్ లుగా ఇద్దరి పేర్లను వేయబోతున్నారట.
మొత్తానికి సినిమాటోగ్రాఫర్ వివాదం తొలగిపోయి సినిమా షూటింగ్ ను మళ్లీ ప్రారంభించిన నేపథ్యంలో పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా లో పవన్ పోలీస్ గా కనిపించబోతున్నాడు.పవన్ కు జోడీ ఎవరు అనే విషయంలో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి.
నిత్యా మీనన్ మరియు సాయి పల్లవిలు నటిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.కాని ఆ విషయమై స్పష్టత రావాల్సి ఉంది.