మెగాస్టార్ చిరంజీవి దర్శకత్వం లో పవన్ కళ్యాణ్ హీరో గా మిస్ అయినా సినిమా అదేనా..?

ఓకే కుటుంబం నుండి కోట్లాది మంది అభిమానులను ఎవరి స్టైల్ లో వారు సంపాదించుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది.అలాంటి అరుదైన సంఘటన మెగా ఫ్యామిలీ లో జరిగింది.

 Pawan Kalyan As The Hero In The Direction Of Megastar Chiranjeevi, But The Movie-TeluguStop.com

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన చిరంజీవి, తన సొంత కష్టం తో మెగాస్టార్ గా ఎదిగాడు.ఆయన మెగాస్టార్ గా కొనసాగుతున్న రోజుల్లోనే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) మరియు నాగబాబు ని ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు.

పవన్ కళ్యాణ్ సక్సెస్ అవ్వగా, నాగబాబు అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేకపోయాడు.ఇక పవన్ కళ్యాణ్ చిరంజీవి ( Chiranjeevi )సోదరుడిగా వచ్చినప్పటికీ తన అన్నయ్య ని ఏమాత్రం అనుకరించకుండా, కేవలం తన సొంత ఆలోచనలతో, కేవలం 7 సినిమాలతోనే అన్నయ్య రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించాడు.

ఆరోజుల్లో ఓపెనింగ్స్ విషయం లో పోటీ చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ సినిమాల మధ్యనే ఉండేవి.

Telugu Gudumba Shankar, Chiranjeevi, Pawan Kalyan-Movie

కానీ అభిమానుల్లో వీళ్లిద్దరి విషయం లో ఒక నిరాశ మాత్రం ఎప్పటి నుండో ఉంది.ఇన్ని సంవత్సరాల నుండి ఇండస్ట్రీ లో ఉన్నప్పటికీ కూడా వీళ్లిద్దరు కలిసి ఒక్కటంటే ఒక్క మల్టీస్టార్రర్ చిత్రం లో కూడా నటించలేదు.చిరంజీవి హీరో గా నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ ( Shankar Dada MBBS )మరియు శంకర్ దాదా జిందాబాద్ చిత్రాల్లో పవన్ కళ్యాణ్ చిన్న అతిధి పాత్రలు పోషించాడు కానీ, పూర్తి స్థాయి మల్టీస్టార్ర్ర్ సినిమా మాత్రం ఇప్పటి వరకు వీళ్ళ కాంబినేషన్ లో రాలేదు.

కానీ చిరంజీవి దర్శకుడిగా, పవన్ కళ్యాణ్ హీరో గా ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ఒక సినిమా ప్లాన్ చేసాడు.ఈ ఐడియా ఎదో బాగుంది, కచ్చితంగా చేద్దాం అని ముగ్గురు అనుకున్నారు.

పరుచూరి బ్రదర్స్ కథని అందించారు, సెట్స్ పై వెళ్లేందుకు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి అయ్యాయి.

Telugu Gudumba Shankar, Chiranjeevi, Pawan Kalyan-Movie

ఈ చిత్రాన్ని ‘గుడుంబా శంకర్ ‘( Gudumba Shankar ) సినిమా తర్వాత చేద్దాం అనుకున్నారు.సోనాలి బ్రిందే ఇందులో హీరోయిన్, అయితే పరుచూరి బ్రదర్ రాసిన స్క్రిప్ట్ లో ఫస్ట్ హాఫ్ చిరంజీవి కి బాగా నచ్చింది కానీ, సెకండ్ హాఫ్ నచ్చలేదు.ఆయన సూచించిన విధంగా మార్పులు చేసుకొని రమ్మన్నాడు చిరంజీవి.

ఆయన చెప్పినట్టుగానే మార్పులు చేసి తీసుకొచ్చారు, కానీ అప్పటికీ కూడా చిరంజీవి సంతృప్తి చెందలేదు.కొన్ని రోజులు ఈ ప్రాజెక్ట్ ని ఆపుదాం, రెండు సినిమాలు సంతకం చేశాను, వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం అవ్వుధి, నువ్వు కళ్యాణ్ తో సినిమా తియ్యాలని డేట్స్ తీసుకున్నావు కాబట్టి నువ్వు వేరే డైరెక్టర్ ని పెట్టుకొని వేరే ఏదైనా కథ తో సినిమా చేసుకో అని అన్నాడు అట.అలా వచ్చిందే బాలు సినిమా, కమర్షియల్ గా ఈ చిత్రం యావరేజి గా నిల్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube