పార్టీ ఫిరాయింపులపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు, చెత్త అంతా బయటకు వెళితేనే

ఇటీవల జనసేన నేతలు వరుసగా పార్టీ కి ఝలక్ ఇస్తూ ఇతర పార్టీల గూటికి చేరుతున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు.

 Pawan Comments About Party Changing Leaders-TeluguStop.com

నాతొ పాటు 25 ఏళ్ల పాటు రాజకీయాల్లో ప్రయాణించే నేతలు కావాలి తప్ప ఇలా పార్టీలను మారే నేతలు కాదని పవన్ అన్నారు.అంతేకాకుండా ఎవరైతే నిస్వార్ధంగా ప్రజాసేవ కోసం ఉంటారో వారే జనసేన వెంట చివరివరకు నిలబడతారని,చెత్తంతా బయటకు వెళితేనే తేట నీళ్లు అనేవి బయటకు వస్తాయని పవన్ స్పష్టం చేశారు.

అయితే పవన్ వ్యాఖ్యలు చేసిన తెల్లారే మరో జనసేన నేత ఆ పార్టీ కి గుడ్ బై చెప్పారు.ఇప్పటికే జనసేన కు గుడ్ బై చెప్పిన నేతలలో కొందరు బీజేపీ గూటికి చేరిపోగా,మరికొందరు మాత్రం వైసీపీ వైపు వెళ్లారు.

ఇప్పటికే ఐదారుగురు నేతలు పార్టీ ని ఫిరాయించి గట్టి ఝలక్ ఇవ్వగా ఇప్పుడు తాజాగా మరో నేత కూడా ఆ పార్టీ కి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తుంది.కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి పోటీచేసిన అభ్యర్థి, జియోలజిస్ట్‌ ధరణికోట వెంకటరమణ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ కండువా కప్పుకున్నట్లు తెలుస్తుంది.

Telugu Janasenapawan, Janasenajoin, Pawan, Pawan Change-

  వెంకటరమణ సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు.తర్వాత జగ్గయ్యపేట టికెట్ దక్కించుకొని పోటీ చేసి ఓడిపోయారు.ఆయనకు కేవలం 1311 ఓట్లు మాత్రమే వచ్చాయి.ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఆ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న ఆయన తాజాగా పార్టీ కి గుడ్ బై చెప్పి కాషాయం కండువా కప్పుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube