జూనియర్ ఎన్టీఆర్ లో ఆ రెండు లక్షణాలు ఉన్నాయి : గోపాలకృష్ణ

నిన్ను చూడాలని సినిమాతో హీరోగా తెలుగు తెరపై తెరంగేట్రం చేసిన జూనియర్ ఎన్టీఆర్ అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు ఎన్నో విజయాలను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.అరవింద సమేత సినిమా తరువాత ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా కోసం ఏకంగా మూడు సంవత్సరాలు కేటాయించారు.

 Paruchuri Gopalakrishna Interesting Comments About Junior Ntr, Comments Viral, I-TeluguStop.com

ఆర్ఆర్ఆర్ రూపంలో శ్రమకు తగిన ఫలితం దక్కుతుందని జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నారు.

ఇకపోతే ప్రముఖ టాలీవుడ్ రచయితలలో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ మరోవైపు ఎవరు మీలో కోటీశ్వరులు అనే రియాలిటీ షోకు యాంకర్ గా వ్యవహరించడానికి సిద్ధమయ్యారు.ఎన్టీఆర్ ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేయడం గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ గుర్తింపు ఉన్న హీరోలు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే అవసరమా అని అనిపిస్తుందని తెలిపారు.

Telugu Ntr-Movie

అయితే హిందీలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రామ్ మంచి పేరు తెచ్చిపెట్టిందని సీనియర్ ఎన్టీఆర్ లా చిన్న రామయ్య(జూనియర్ ఎన్టీఆర్)కు సమయస్పూర్తితో పాటు జ్ఞాపకశక్తి ఎక్కువని గోపాలకృష్ణ అన్నారు.ఫేస్ లో ప్రశ్నకు సమాధానం రైటా ? రాంగా ? అని తెలీకుండా చేసే ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం కోసం తాను ఎంతో ఎదురు చూస్తున్నానని ఆయన అన్నారు.చిన్న రామయ్య ఈ కార్యక్రమం ద్వారా తెలుగువారి ఔన్నత్యాన్ని చాటి చెబుతాడని భావిస్తున్నామని గోపాలకృష్ణ పేర్కొన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ఒక మీటింగ్ లో మాట్లాడుతూ తనను ఏ పేరు పెట్టి పిలిచినా పలుకుతానని అన్నారని అయితే తాను తారక్ అని పిలిస్తే మాత్రం చిన్నరామయ్య అని పిలవాని ఎన్టీఆర్ చెబుతాడని పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube