మహేష్ కోసం పరశురాం ఏం చేశాడంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటంచిన రీసెంట్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.సంక్రాంతి బరిలో వచ్చిన ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.

 Mahesh Babu, Parasuram, Vamsi Paidipalli, Geetha Arts-TeluguStop.com

ఇక ఈ సినిమా తరువాత మహేష్ తన నెక్ట్స్ మూవీని దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో చేయాల్సి ఉంది.

కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదు.

దీంతో తన నెక్ట్స్ మూవీని గీతా గోవిందం డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.పరశురాం చెప్పిన ఓ స్టోరీలైన్ మహేష్‌కు బాగా నచ్చడంతో ఈ సినిమా చేసేందుకు మహేష్ ఓకే అన్నాడట.

అయితే ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా స్క్రిప్టును మహేష్‌కు పూర్తిగా వినిపించడం కుదరడం లేదట.దీంతో పరశురాం తాజాగా ఈ సినిమా స్క్రిప్టును మహేష్‌కు మెయిల్ చేశాడట.

ఈ స్క్రిప్టుకు సంబంధించి ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే మహేష్ చెప్పిన తరువాత స్క్రిప్టును ఫైనల్ చేయనున్నారు.మొత్తానికి లాక్‌డౌన్ ప్రభావం ఉన్నప్పటికీ సినిమా పనులు మాత్రం ఆగడం లేదు.

మరి ఈ సినిమాను ఎప్పటికి సెట్స్‌పైకి తీసుకెళ్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube