సినిమాల మీద సినిమాలు చేస్తూ క్షణకాలం తీరిక లేకుండా గడుపుతున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్,( Prabhas ) రీసెంట్ గానే ‘సలార్’( Salaar ) సినిమాతో మన ముందుకు వచ్చి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే.మొదటి వారం లోనే 480 కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టి, సౌత్ లో ఆల్ టైం నాన్ రాజమౌళి రికార్డు ని నెలకొల్పిన ప్రభాస్, ఈ ఏడాదిలో మొదటి వారం అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రం గా సలార్ ని నిలిపాడు.
ఈ సినిమా తర్వాత ప్రభాస్ నుండి ఏ సినిమా విడుదల అవ్వబోతుంది అనే సందేహం అభిమానుల్లో నిన్న మొన్నటి వరకు ఉండేది.
కానీ నేడు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ వారు ప్రభాస్ – మారుతీ( Prabhas – Maruthi ) కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నాం అని తెలిపారు.
అంటే ‘సలార్’ తర్వాత ప్రభాస్ నుండి రాబోతున్న సినిమా ఇదే అన్నమాట.ఈ సినిమా విడుదలైన తర్వాతే కల్కి చిత్రం( Kalki Movie ) విడుదల అవుతుంది.
కల్కి సినిమాలో ప్రభాస్ కి సంబంధించిన సన్నివేశాలు మొత్తం దాదాపుగా పూర్తి అయ్యినట్టే.కేవలం కమల్ హాసన్ తో కాంబినేషన్ సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉంది.

కేవలం 15 రోజుల డేట్స్ ఇస్తే సరిపోతుంది.అలాగే ప్రభాస్ – మారుతీ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కూడా షూటింగ్ కూడా దాదాపుగా 70 శాతం పూర్తి అయ్యిందట.ఈ సినిమా కూడా షూటింగ్ ని కూడా త్వరగా పూర్తి చేసి, సినిమాలకు కొంతకాలం బ్రేక్ ఇవ్వాలని ప్రభాస్ ఆలోచిస్తున్నాడట.అందుకు కారణం రీసెంట్ గా ఆయనకి జరిగిన మోకాళ్ళ సర్జరీనే( Knee Surgery ) అని ప్రభాస్ సన్నిహితులు చెప్తున్నారు.
డాక్టర్ల సూచన మేరకు ప్రభాస్ కి సర్జరీ( Prabhas Surgery ) జరిగిన తర్వాత కొంత కాలం విశ్రాంతి అవసరం.

కానీ ఆర్టిస్టుల డేట్స్ సమస్య నిర్మాతలకు వస్తుంది అనే కారణం చేత ప్రభాస్ వరుసగా ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసాడు.ఆయన నుండి ఈ ఏడాది లో రెండు సినిమాలు విడుదలయ్యాయి.ఈ రెండు సినిమాల తర్వాత ఆయన హను రాఘవపూడి, సందీప్ వంగ మరియు లోకేష్ కనకరాజ్ వంటి స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు ఒప్పుకున్నాడు.
ఇవి సెట్స్ మీదకి వెళ్లేందుకు కచ్చితంగా లాంగ్ బ్రేక్ పడుతుందని అంటున్నారు, చూడాలి మరి.