యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!

ఏదో సినిమాలో డైలాగ్ చెప్పిన విధంగా జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) రాజకీయాలను వదిలినా రాజకీయాలు ఎన్టీఆర్ ను మాత్రం వదలడం లేదు.టీడీపీ ర్యాలీలలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను తారక్ ఫ్లెక్సీలను ప్రదర్శించడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.

 Palabhishekam For Young Tiger Junior Ntr Flexi In Tdp Rally Details, Palabhishek-TeluguStop.com

తాజాగా చిత్తూరు జిల్లాలో( Chittoor District ) జరిగిన ఒక ర్యాలీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు.టీడీపీ ( TDP ) ర్యాలీలో ఎన్టీఆర్ కు పాలాభిషేకం చేయడం హాట్ టాపిక్ అవుతోంది.

ఎన్టీఆర్ అభిమానులు( NTR Fans ) బాబుకు భలే షాకిచ్చారుగా అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.

మరో 12 రోజుల్లో ఏపీ ఎన్నికలు( AP Elections ) జరగనుండగా ఎన్నికల విషయంలో తారక్ సైలెంట్ గా ఉంటున్నా తారక్ అభిమానులు మాత్రం అస్సలు సైలెంట్ గా ఉండటం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ మాత్రం దేవర( Devara ) షూటింగ్ ను మే చివరినాటికి పూర్తి చేయనున్నారని తెలుస్తోంది.పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వీలైనంత ఎక్కువ సమయం కేటాయించే విధంగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ప్లాన్స్ ఉన్నాయని తెలుస్తోంది.జూనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో ఏ సినిమాకు పడని స్థాయిలో ఈ సినిమా కోసం కష్టపడ్డారని సమాచారం అందుతోంది.

జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ లకు సైతం దేవర మరపురాని సినిమాగా నిలిచే ఛాన్స్ అయితే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.దేవర1 సినిమాకు దేవర 2 సినిమాకు మధ్య గ్యాప్ ఉండనుందని తెలుస్తోంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంచుకుంటున్న ప్రాజెక్ట్స్ భారీ స్థాయిలో ఉండగా ఆ సినిమాలు భారీ సక్సెస్ అందుకుంటాయని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.తారక్ రాబోయే రోజుల్లో అయినా ఏపీ రాజకీయాల గురించి స్పందిస్తారేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube