కుక్క తోక వంకర పాకిస్తాన్ నోట అబద్ధం మాత్రమే వచ్చునురా అని ఇక నుండి మన పుస్తకాలలో రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది,ప్రస్తుతం పాకిస్తాన్ అవలంబించే తీరు చూస్తుంటే.మొన్నటికి మొన్న భారత్ పై సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో తీవ్రంగా ఫైర్ అయ్యామని పాపం పాకిస్తాన్ ఓ పస లేని అబద్ధాన్ని ప్రొజెక్ట్ చేసింది దీనిపై స్పందించిన భారత్ ఇందులో మాకు పాకిస్తాన్ ఎక్కడ కనపడలేదనే నిజాన్ని చెప్పి సరైన కౌంటర్ వేసి పాకిస్తాన్ పరువును తీసింది.
అయినా పాపం పాకిస్తాన్ కి బుద్ధి వచ్చినట్లు కనిపించడం లేదు.అందుకే మరోమారు తమ దేశంలో ఉగ్ర నాయకులు ఉన్నారని ప్రకటించుకున్న పాకిస్తాన్ కు భారత్ పుల్వామా ఛార్జ్ షీట్ ను పంపించింది.
దీనిపై పాకిస్తాన్ మరోమారు పాత పాటే పాడింది.మాకు భారత్ సరైన ఆధారాలను అందించలేదని అందుకే ఈ ఛార్జ్ షీట్ ను రిజెక్ట్ చేస్తున్నామని ప్రకటించింది.
అంతేకాకుండా బీజేపీ ఈ ఛార్జ్ షీట్ లో యాంటీ పాకిస్తాన్ స్టాండ్ ను ప్రతిబింబించేలా తయారు చేసిందని ఆరోపించింది.దీనిపై భారత్ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో వేచి చూడాలి