నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై డిసెంబర్ 6వ తేదీన కేంద్ర జలశక్తి శాఖ సమావేశం కానుంది.
ఈ మేరకు ఏపీ, తెలంగాణ సీఎస్ లతో పాటు ఇతర అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది.
కృష్ణా జలాల పంపకం వివాద పరిష్కారం, నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టు, కృష్ణానది నీటి యాజమాన్య బోర్డు ద్వారా నిర్వహణ అంశాలపై చర్చించనున్నారు.ఈ అంశాలపై ఇవాళ సమావేశం జరిగింది.
అయితే ఈ రోజు జరిగిన సమావేశానికి తెలంగాణ సీఎస్ హాజరు కాలేకపోయారని సమాచారం.ఈ క్రమంలోనే 5వ తేదీన జరిగే సమావేశాన్ని మార్చాలని సీఎస్ కోరారు.
దీంతో ఈనెల 6న ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు.