డిసెంబర్ 6న మరోసారి కేంద్ర జలశక్తి శాఖ సమావేశం
TeluguStop.com
నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై డిసెంబర్ 6వ తేదీన కేంద్ర జలశక్తి శాఖ సమావేశం కానుంది.
ఈ మేరకు ఏపీ, తెలంగాణ సీఎస్ లతో పాటు ఇతర అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది.
కృష్ణా జలాల పంపకం వివాద పరిష్కారం, నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టు, కృష్ణానది నీటి యాజమాన్య బోర్డు ద్వారా నిర్వహణ అంశాలపై చర్చించనున్నారు.
ఈ అంశాలపై ఇవాళ సమావేశం జరిగింది.అయితే ఈ రోజు జరిగిన సమావేశానికి తెలంగాణ సీఎస్ హాజరు కాలేకపోయారని సమాచారం.
ఈ క్రమంలోనే 5వ తేదీన జరిగే సమావేశాన్ని మార్చాలని సీఎస్ కోరారు.దీంతో ఈనెల 6న ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు.
రక్తదానం ప్రయోజనాలేంటి.. ఎవరు చేయాలి? ఎవరు చేయకూడదు?