వరద బాధిత ముంపు ప్రాంతాల పునరావాస కేంద్రంలో అధికారులు ఒక బాలుడు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వరద ముంపు ప్రాంతాలైన కొత్త నవరసాపురం పాత నవరసపురం గ్రామాల పునరావస కేంద్రం స్థానిక మిషన్ హై స్కూల్లో నవరసపురం గ్రామానికి చెందిన 9 ఏళ్ల బాలుడు మధు పుట్టినరోజు వేడుకలు అధికారులు ఘనంగా నిర్వహించారు.
ప్రభుత్వం వరద బాధితులకు కల్పిస్తున్న సౌకర్యాలు ఎలా ఉన్నాయనేది ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది తమ ఇంటి వద్ద ఉంటే పుట్టినరోజు ఘనంగా జరుపుకునే వాళ్ళం అని తల్లితండ్రులు బాలుడుతో అంటుండగా విన్న అధికారులు పునరావాస కేంద్రంలో గ్రామస్తులు సమక్షంలో పుట్టినరోజు నిర్వహించారు.పునరావసర కేంద్ర ప్రత్యేక అధికారి ఎంపిడిఓ ఆనంద్ కుమార్ అధికారులు బాలుడితో కేక్ కట్ చేయించి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.
దీనితో బాలుడు కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.