కొన్ని దశాబ్దాల నుంచి మాత్రమే కాదు ఇప్పుడూ కూడా సీనియర్ స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు విక్టరీ వెంకటేష్. దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమయిన వెంకటేష్ ఇక తన సినిమాలతో విక్టరీని తన పేరుగా మార్చుకున్నాడు.
ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు ఎప్పుడు కేరాఫ్ అడ్రస్ గా కొనసాగుతూ ఉంటాడు విక్టరీ వెంకటేష్.ఇకపోతే విక్టరీ వెంకటేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా నువ్వు నాకు నచ్చావ్.
విజయభాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కామెడీ ప్రేక్షకులందరినీ కూడా ఎంతగానో ఆకర్షించింది.ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరసన దివంగత నటి ఆర్తి అగర్వాల్ నటించింది.
ఈ సినిమాలో కీలక పాత్రలో ప్రకాష్రాజ్, చంద్రమోహన్, సుహాసిని, సునీల్ నటించడం గమనార్హం.శ్రీ స్రవంతి మూవీస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు,, స్రవంతి రవికిషోర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.
ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇక ఈ సినిమాకు కథ అందించడం గమనార్హం.ఇక ఈ సినిమాలో వెంకటేష్ ఆర్తి అగర్వాల్ మధ్య కెమిస్ట్రీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా బాగా కనెక్ట్ అయిపోయింది అని చెప్పాలి.
ఈ సినిమాలోని ఎమోషనల్ సన్నివేశాలు అందరిని కంటతడి పెట్టించాయి.సునీల్ స్టార్ కమెడియన్ గా ఎదగడానికి ఇక ఈ సినిమా ఎంతగానో ఉపయోగ పడింది అని చెప్పాలి.
అంతేకాదు దేవీపుత్రుడు, ప్రేమతో రా లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్ చవిచూసిన వెంకటేష్ కి నువ్వు నాకు నచ్చావ్ సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది.
అయితే ఈ సినిమాని ముందుగా వెంకటేష్ తో తీయాలని అనుకోలేదట.బాల నటుడిగా ప్రేక్షకులను అలరించి ఇక ఆ తర్వాత నువ్వే కావాలి సినిమా తో హీరోగా మారి ప్రేక్షకులను అలరించి ఒక్కసారి గా ఒక వెలుగు వెలిగిన తరుణ్ తో నువ్వు నాకు నచ్చావ్ సినిమా చేయాలని అనుకున్నాడట.అయితే అప్పటికే తరుణ్ ఇతర ప్రాజెక్టుల కారణంగా బిజీగా ఉండటంతో ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట.
ఆ తర్వాత వెంకటేష్ హీరోగా తీసుకుని తెరకెక్కించి విడుదల చేయగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.సినిమా సూపర్ హిట్ తర్వాత మంచి సినిమాను వదులుకున్నందుకు తరుణ్ చాలా బాధపడిపోయాడట.