చిరుకు నో చెప్పిన తారక్.. ఉత్తదే అంటోన్న త్రివిక్రమ్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు తారక్ రెడీ అయ్యాడు.

 Ntr Trivikram Movie Not Inspired From Chiru Movie-TeluguStop.com

ఈ మేరకు చిత్ర అనౌన్స్‌మెంట్ కూడా జరిగింది.ఇక ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఎంచుకున్న కథ మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓ సినిమా నుండి తీసుకున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.

అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన మంత్రిగారి వియ్యంకుడు అనే సినిమా కథ నుండి స్పూర్తి పోంది ఈ సినిమా కథను త్రివిక్రమ్ రాసినట్లు సోషల్ మీడియా కోడై కూసింది.దీంతో ఈ వార్త చిత్ర యూనిట్ వరకు చేరగా, వారు ఈ వార్తలను ఖండించారు.

ఇదంతా కేవలం పుకార్లేనని, చిరు సినిమాతో ఈ సినిమాకు సంబంధం ఉండదని వారు తెలిపారు.తారక్ కోసం త్రివిక్రమ్ ఓ అదిరిపోయే కథను రెడీ చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కథ ఇంకా పూర్తి కాలేదని, అయిన వెంటనే చిత్ర షూటింగ్ ప్రారంభిస్తారని చిత్ర వర్గాలు తెలిపాయి.

ఇక ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

తారక్‌ను మరింత పవర్‌ఫుల్‌గా చూపించేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట.ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందనను ఎంపిక చేశారు చిత్ర యూనిట్.

ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్, రాధాకృష్ణలు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube