తెలుగులో తక్కువ సినిమాలే చేసినా అల్లు ఫ్యామిలీ సపోర్ట్ ఉండటం, క్రేజ్ ఉన్న డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడం వల్ల అల్లు శిరీష్ శ్రీరస్తు శుభమస్తు, కొత్తజంట, ఊర్వశివో రాక్షసివో సినిమాలతో మంచి ఫలితాలనే అందుకున్నారు.సాధారణంగా అల్లు శిరీష్ అడపాదడపా వివాదాలలో నిలిచినా ఎవరినీ హర్ట్ చేసేలా వివాదాలు క్రియేట్ చేయలేదు.
అయితే ఆర్.ఆర్.ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డులలో బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో అవార్డ్ వచ్చింది.
ఆర్.
ఆర్.ఆర్ మూవీ కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు అంచనాలను మించి ప్రేక్షకులను మెప్పించింది.ఆర్.ఆర్.ఆర్ కు అవార్డ్ రావడంపై సెలబ్రిటీల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.మోదీ నుంచి జగన్ వరకు ప్రముఖ రాజకీయ నేతలు సైతం సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అల్లు శిరీష్ కూడా అందరిలా సోషల్ మీడియా వేదికగా ఆర్.ఆర్.ఆర్ యూనిట్ ను ప్రశంసిస్తూ ట్వీట్ చేయడం జరిగింది.
శిరీష్ ట్విట్టర్ లో అందరినీ ట్యాగ్ చేసి జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ అకౌంట్ ను మాత్రం ట్యాగ్ చేయకుండా #ntrjr అని పేర్కొన్నారు.వాస్తవానికి తారక్ కు అధికారిక ట్విట్టర్ ఖాతా ఉంది.అయితే అల్లు శిరీష్ కావాలనే ఈ విధంగా చేశారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ టార్గెట్ చేసి కామెంట్లు చేస్తున్నారు.
అల్లు శిరీష్ పొరపాటు చేసి ఉంటే ఆ తర్వాత అయినా ట్వీట్ ను ఎడిట్ చేయవచ్చు.అయితే అల్లు శిరీష్ మాత్రం నెటిజన్ల కామెంట్లను పట్టించుకోలేదు.
ఫ్యాన్స్ ను హర్ట్ చేసే పనులు శిరీష్ చేయడం కరెక్ట్ కాదని కొంతమంది సూచనలు చేస్తున్నారు.చరణ్ ను ట్యాగ్ చేసినట్టే ఎన్టీఆర్ ను కూడా ట్యాగ్ చేసి ఉంటే బాగుండేదని శిరీష్ ట్యాగ్ కు బదులుగా హ్యాష్ ట్యాగ్ ఉపయోగించడం కరెక్ట్ కాదని చెబుతున్నారు.రాబోయే రోజుల్లో శిరీష్ ఈ వివాదం గురించి స్పందించే అవకాశాలు అయితే ఉన్నాయి.