అలా మొదలైంది సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు మలయాళీ ముద్దుగుమ్మ నిత్యమీనన్( Nithya Menen ) .మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం తెలుగులో పలు సినిమాలలో నటించి నేర్పించారు ఇక చివరిగా ఈమె తెలుగులో భీమ్లా నాయక్( Bheemla Nayak ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
నిత్యమీనన్ కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా కన్నడ మలయాళ సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.అలాగే సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె గురించి ఎన్టీఆర్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

నిత్యామీనన్ గురించి ఎన్టీఆర్( NTR ) మాట్లాడుతూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.ఆమె నటన ముందు ఎవ్వరైనా తక్కువ కావాల్సిందేనని ఎన్టీఆర్ తెలిపారు అయితే ఈమెకు సరైన సినిమా అవకాశాలు దొరకడం లేదని అలాంటి పాత్రలు కనుక పడితే ఈమె కంటే గొప్పగా నటించేవారు ఉండరు అంటూ నిత్యమీనన్ నటన గురించి ఎన్టీఆర్ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఎన్టీఆర్ నిత్యమీనన్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జనతా గ్యారేజ్( Janatha Garage )ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.

కొరటాల శివ( Koratala Shiva ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సమంత నిత్యామీనన్ ప్రధాన పాత్రలలో నటించారు.అయితే సమంత( Samantha )తో బ్రేకప్ చెప్పుకున్నటువంటి ఎన్టీఆర్ ఈ సినిమాలో చివరికి నిత్యమీనన్ ను పెళ్లి చేసుకుంటారు.ఇలా నిత్యమీనన్.
కలిసి ఈ సినిమాలో నటించినటువంటి ఎన్టీఆర్ ఆమె నటన ప్రావీణ్యం పై ప్రశంసలు కురిపిస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ నిత్యమీనన్ అభిమానులను సంతోషానికి గురిస్తున్నాయి.ఇక నిత్యమీనన్ సినిమాలలో ఎలాంటి గ్లామరస్ పాత్రలకు చోటు లేకుండా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటారు.
అదేవిధంగా నిత్యమీనన్ ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ పాత్రలలో కూడా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.