Sr Ntr Devika : ఈ తల్లి, కూతురు ఎన్టిఆర్ తో కలిసి నటించారని మీకు తెలుసా?

ఈరోజుల్లో ఒక హీరోయిన్ తండ్రి, కొడుకుతో కలిసి నటించడం కామన్ అయిపోయింది.ముందు కొడుకుతో నటించి ఆ తరువాత ఆ హీరో తండ్రితో కూడా నటించిన సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి.

 Ntr Acted With These Mother And Daighter Tollywood-TeluguStop.com

తాజాగా రామ్ చరణ్ తో కలిసి నటించిన కాజల్ మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమాలో చిరుతో కలిసి రొమాన్స్ చేసింది.అయితే ఆరోజుల్లో ఒక తల్లి, కూతురు ఒక ఎన్టిఆర్ తో కలిసి నటించడం విశేషం.

ఎన్టిఆర్( Sr ntr ) తో కలిసి నటించిన దేవిక గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

Telugu Devika, Kanaka, Sr Ntr, Tamil Actress, Tollywood-Movie

దేవిక( Devika ) .ఒకప్పుడు స్టార్ హీరోయిన్.ఎన్టిఆర్ తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు.

తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో అన్ని విషయాల్లో పట్టుసాధించారు.

ఆ కారణమే ఆ తరువాత కూతురిని సినిమాల్లోకి రానివ్వకుండా చేసిందనే చెప్పాలి.దేవిక కూతురు కనక.కనక తెలుగులో కేవలం రెండు సినిమాల్లోనే కనిపించింది.అందులో ఒకటి ఎన్టిఆర్ తో చేయడం విశేషం.

రెండోది రాజేంద్రప్రసాద్ తో చేసిన సినిమా.అయితే ఆ తరువాత తమిళంలో, మలయాళంలోనూ నటించింది.

Telugu Devika, Kanaka, Sr Ntr, Tamil Actress, Tollywood-Movie

కనక( Kanaka ) అద్భుతంగా నటించిన ఎక్కువ సినిమాల్లో నటించకపోడానికి కారణం దేవిక అట.దేవికకి ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనేది బాగా తెలుసు.సినీ ఇండస్ట్రీలో దేవిక ఎవ్వరిని నమ్మేవారు కాదు.చాలా జాగ్రత్తగా ఉండేవారు.దీంతో ఇండస్ట్రీలో కూతురిని ఎక్కువగా రానివ్వకుండా చేసింది.అభ‌ద్ర‌తా భావం ఎక్కువ‌గా క‌నిపించేది.

ఎవరైనా నమ్మించి మోసం చేస్తారేమో అని భయపడేది.అంతేకాదు సినిమా వారిని ఎక్కువగా ఇంటికి రానిచ్చేవారు కాదు.

ఎవరైనా వస్తే ముందు ఫోన్ చేసి రమ్మని చెప్పేవారట.మేకప్ చేసేవారిని కూడా ఎప్పటికప్పుడు మార్చేస్తుండేవారు.

కూతురు ఎక్కడికి వెళ్లినా దేవిక కూడా తన వెంటే వెళ్లెదట.సినిమా హీరోలతో ఎక్కువగా మాట్లాదనించేవారు కాదు.

కూతురి దగ్గరికి ఎవ్వరిని రానివ్వకుండా చూసుకునేవారు.దీంతో కూతురు కెరీర్ ముందుకు వెళ్లలేకపోయింది.

ఆ తరువాత సినిమా అవకాశాలు అస్సలు రాలేదు.దీంతో మనస్తాపానికి గురైన కనక ఇంటి నుంచే వెళ్ళిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube