అమెరికాలో తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు.. ఎందుకసలు ఇంత ప్రకోపం..

అగ్రరాజ్యం అమెరికా( America )లో తెలుగు తమ్ముళ్లు ఆంధ్రప్రదేశ్ పరువు పూర్తిగా తీసేశారు.టీడీపీ ఎన్నారైలు అమెరికాలోని పెన్సిల్వేనియాలో తాజాగా జరిగిన తానా తెలుగు మహాసభల్లో ఒకరికొకరు తన్నుకుంటూ అనాగరికలుగా ప్రవర్తించారు.

 Nri Clash In Tana Conference In Texas, Nri Clash Telugu Association Of North A-TeluguStop.com

వారు వీధి రౌడీల వలె కొట్టుకుంటుంటే, మరికొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఆ వీడియో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వైరల్ గా మారింది.

అది చూసి “ఉత్తర అమెరికా తెలుగు మహాసభ( TANA Conference )లో తెలుగువారి పరువు తీసేసారు కదా” అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

Telugu Nri Clash, Pennsylvania, Tana Conference, Tanatelugu, Telugu America, Tel

వివరాల్లోకి వెళితే.పెన్సిల్వేనియాలో 23వ తెలుగు మహాసభలు శనివారం చాలా గ్రాండ్‌గా స్టార్ట్ అయ్యాయి.ఈ సభలకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ( N.V.Ramana ), మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బాలకృష్ణ వంటి ప్రముఖులు హాజరయ్యారు.తానా అంటే ఉత్తర అమెరికా తెలుగు సంఘం.ఇక తానా మహాసభలంటే తెలుగుదేశం సభలనే చెప్పవచ్చు.ఎందుకంటే ఈ మహాసభలలో 99% తెలుగు వారు మాత్రమే పాల్గొంటారు.వారందరూ కూడా దాదాపు తెలుగు తమ్ముళ్లే అయి ఉంటారు.

అక్కడ వారి ఆధిపత్యం సాగుతుంది.

Telugu Nri Clash, Pennsylvania, Tana Conference, Tanatelugu, Telugu America, Tel

అయితే తాజాగా జరిగిన మహాసభల్లో ఈ తెలుగు తమ్ముళ్ల మధ్య ఓ విషయంలో విభేదాలు వచ్చాయి.దాంతో వాళ్ళు రెండు వర్గాలుగా చీలి విచక్షణారహితంగా కొట్టుకున్నారు.లోకేష్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన రావడమే ఈ వివాదానికి కారణమని తెలిసింది.

చంద్రబాబు అసమర్ధ పాలనను మాని జూనియర్ ఎన్టీఆర్ ని పార్టీలోకి తీసుకురావాలని మొదట కొందరు తెలుగు తమ్ముళ్లు అన్నారు.ఈ కామెంట్స్ చేసిన తర్వాత పరుచూరి, వేమన సతీష్ వర్షాలు తీవ్రమైన వాగ్వాదానికి దిగాయి.

తర్వాత తెలుగు తమ్ముళ్లు సహనం కోల్పోయి ఒకరిపై ఒకరు పిడుగులు గుద్దుకున్నారు.అలాగే తన్నులాడుకున్నారు.చొక్కాలు చేయించుకున్నారు.కొద్ది రోజుల క్రితం టెక్సాస్‌లో బాలకృష్ణ( Balakrishna ) వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య కూడా ఇలాంటి తన్నులాట చోటు చేసుకుంది.

ఇంకా ఆ పని విషయాల్లో తెలుగు తమ్ముళ్లు, తెలుగు వారి మధ్య గొడవలు జరిగాయి.వారందరూ గొడవ జరిగిన ప్రతిసారి తన్నుకుంటూ తెలుగు రాష్ట్రాల పరువును గంగలో కలిపేస్తున్నారు.

అయితే వారికి ఎందుకింత కోపం అని చాలామంది ప్రశ్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube