తమిళ హీరో శివ కార్తికేయన్ ( Siva Karthikeyan )తన నెక్స్ట్ సినిమా మహావీరుడు సినిమాతో తెలుగు ఆడియన్స్ ని అలరించేందుకు వస్తున్నాడు.అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఫాంటసీ కథాంశంతో వస్తుంది.
ఈ సినిమాలో అదితి హీరోయిన్ గా నటించింది.సినిమా జూలై 14న రిలీజ్ అవుతుంది.
తెలుగులో ఆ డేట్ న ఆనంద్ దేవరకొండ ( Anand Deverakonda )బేబీ( Baby ) వస్తుంది.మహావీరుడు సినిమా కూడా ఇదే డేట్ న రిలీజ్ అవుతుంది.
ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ ఉండే ఛాన్స్ ఉంది.

శివ కార్తికేయన్ ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్ సినిమాల క్రేజ్ తో అనుదీప్ తో ప్రిన్స్( Prince ) సినిమా చేశాడు శివ కార్తికేయన్ ఆ సినిమా కూడా తమిళ్ లో బాగానే ఆడింది.అయితే అది తెలుగు ఆడియన్స్ కి అంతగా మెప్పించలేదు.
మళ్లీ మహా వీరుడు సినిమాతో తన సత్తా చాటాలని చూస్తున్నాడు శివ కార్తికేయన్ మరి ఈ సినిమాతో ఏమేరకు తెలుగు ఆడియన్స్ ని అలరిస్తాడో చూడాలి.శివ కార్తికేయన్ కి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.
తప్పకుండా ఈ మహావీరుడు ఆడియన్స్ ని అలరించేలా ఉందని చెప్పొచ్చు.







