ఈ ఏడాది మార్చిలో ఖలిస్తాన్( Khalistan ) వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ వ్యవహారం భారత్‌తో పాటు చాలా దేశాల్లో అలజడి రేపిన సంగతి తెలిసిందే.అతనికి మద్ధతుగా అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాల్లోని భారత రాయబార కార్యాలయాలపై( Indian Embassy ) ఖలిస్తాన్ మద్ధతుదారులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది హింసాత్మకంగా మారి ఆస్తుల విధ్వంసం వరకు వెళ్లింది.ఈ ఘటనలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు ముమ్మరం చేసింది.
దీనిలో భాగంగా ఈ దాడులకు పాల్పడిన 43 మంది అనుమానితులను గుర్తించినట్లు సమాచారం.
శాన్‌ఫ్రాన్సిస్కోలో( San Francisco ) మార్చి 18న అర్ధరాత్రి సమయంలో కొందరు ఖలిస్తాన్ అనుకూలవాదులు భారత కాన్సులేట్‌లోకి చొరబడి దానిని తగులబెట్టేందుకు ప్రయత్నించారు.
అదే రోజున ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేస్తూ కొందరు నిరసనకారులు పోలీసులు అడ్డుగా పెట్టిన బారికేడ్లను ఛేదించుకుంటూ లోనికి ప్రవేశించారు.కాన్సులేట్ ప్రాంగణంలో రెండు ఖలిస్తానీ జెండాలను వుంచి అక్కడి సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు.
ఆ తర్వాత జూలై 1న అర్ధరాత్రి మరోసారి కాన్సులేట్‌లోకి( Indian Consulate ) చొరబడి దానికి నిప్పంటించే ప్రయత్నం చేశారు.

అలాగే లండన్‌లోని( London ) భారత రాయబార కార్యాలయం ముందు నిరసనకు దిగిన ఖలిస్తానీ మద్ధతుదారులు , జాతీయ పతాకాన్ని అగౌరవపరిచే ప్రయత్నం చేశారు.ఈ ఘటన భారత్, యూకేల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది.ఈ ఘటనలపై రంగంలోకి దిగిన ఎన్ఐఏ( NIA ) జూన్ 16న కేసు నమోదు చేసింది.
ఐపీసీ , యూఏ (పీ) చట్టం, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించే నిరోధక చట్టంలోని అనేక సెక్షన్ల కింద అభియోగాలు మోపి దర్యాప్తు ప్రారంభించింది.

విచారణలో భాగంగా ఎన్ఐఏ బృందం ఈ ఏడాది శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్లి కీలక ఆధారాలు సేకరించింది.పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని 15 చోట్ల సోదాలు నిర్వహించింది.ఇప్పటికే పరస్పర న్యాయ సహాయ ఒప్పందం కింద అమెరికా అధికారుల నుంచి ఎన్ఐఏ నవంబర్ 14న సాక్ష్యాలు కోరింది.
సీసీటీవీ ఫుటేజ్ స్కానింగ్ ద్వారా 45 మంది ముఖాలను క్రౌడ్ సోర్సింగ్ కింద గుర్తించామని ఎన్ఐఏ తెలిపింది.కాన్సులేట్‌పై దాడి , విధ్వంసం కేసులో 10 మంది నిందితుల చిత్రాలను సెప్టెంబర్ 21న విడుదల చేసింది.