దిశ తల్లిదండ్రులని విచారించిన హ్యూమన్ రైట్స్

దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ ని సుమోటోగా తీసుకున్న మానవ హక్కుల కమిషన్ విచారణ మొదలెట్టిన సంగతి తెలిసిందే.గత రెండు రోజుల నుంచి ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశంలో విచారణ చేసిన మానవ హక్కుల కమిషన్ ప్రతినిధులు రెండోరోజు తమ విచారణని కొనసాగించారు.

 Nhrc Records Dishas Family Members Statements-TeluguStop.com

ఇందులో భాగంగా ఎన్‌హెచ్‌ఆర్సీ దిశ తల్లిదండ్రులని పిలిచింది.ఎన్‌హెచ్‌ఆర్సీ పిలుపు మేరకు దిశ కుటుంబ సభ్యులతో పాటు కాలనీ వాసులు కూడా హాజరయ్యారు.

ఎన్‌హెచ్ఆర్సీ దిశ కుటుంబ సభ్యులను దాదాపు గంటపాటు విచారించింది.ఈ విచారణలో పలు కీలక విషయాలని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

హ్యూమన్ రైట్స్ ఇప్పటికే నిందితుల కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డ్‌ చేసింది.ఇక ఈ ఎన్ కౌంటర్ ని ఎలా అయిన బూటకపు ఎన్ కౌంటర్ అని నిర్ధారించి, దానిని చేసిన వారిని, చేయించిన వారిని కోర్టుకి లాగాలని మానవ హక్కుల కమిషన్ భావిస్తుంది.

అయితే వారిని దేశ వ్యాప్తంగా ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది.అన్యాయం జరిగినపుడు, ఆడపిల్లలు అత్యాచారాలకి గురై, వారి చేతిలో కిరాతకంగా హత్యలకి గురైనపుడు ఈ మానవ హక్కుల సంఘాలు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నిస్తున్నారు.

దిశ కేసులో పోలీసులు సరైన తీర్పు ఇచ్చారని అంటున్నారు.ఈ ఎన్ కౌంటర్ లో మానవ హక్కుల సంఘం పోలీసులని నిందితులుగా చేర్చి అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే వారి కోసం ప్రజలందరూ రోడ్డు మీదకి వస్తారని, పోలీసుల తరుపున ఆందోళన చేయడానికి కూడా సిద్ధమని హెచ్చరిస్తున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube