1.
లోకేష్ పాదయాత్ర

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) చేపట్టిన యువ గళం పాదయాత్ర నేటికి 42వ రోజుకు చేరుకుంది.ప్రస్తుతం ఏ యాత్ర తంబళ్లపల్లె నియోజకవర్గంలో కొనసాగుతోంది.
2.
రాహుల్ గాంధీ పై ఆగ్రహం
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పై మంత్రి పీయూష్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.విదేశాలకు వెళ్లి భారతదేశం లోని ప్రజాస్వామ్యంకు వ్యతిరేకంగా మాట్లాడితే పార్లమెంట్ చేష్టలుడికి చూస్తూ కూర్చొదని ఆయన హెచ్చరించారు.
3.
ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ పై రాజ్యసభలో చర్చ

ఆర్ ఆర్ ఆర్ కు ఆస్కార్ రావడంపై రాజ్యసభ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
4.
రేపటి నుంచి వంటి పూట బడులు
ఈనెల 15 నుంచి ఒంటి పూట బడులను ప్రారంభించనున్నారు.ఈ మేరకు తెలంగాణ విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
5.
రాజ్ భవన్ వద్ద ఉద్రిక్తత

వివిధ విద్యార్థి సంఘాల ముట్టడితో రాజ్ భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.యూనివర్సిటీ కామన్ రిటైర్మెంట్ బోర్డ్ బిల్లు గవర్నర్ వెంటనే ఆమోదం తెలపాలంటూ వివిధ విద్యార్థి సంఘాలు ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
6.
సిబిఐ కార్యాలయం అవినాష్ రెడ్డి
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసిపి ఎంపీ అవినాష్ రెడ్డి ని సిబిఐ ఈరోజు విచారించనుంది.ఈ నేపథ్యంలో ఆయన తన న్యాయవాదులతో కలిసి సిబిఐ కార్యాలయం కు చేరుకున్నారు.
7.
పొత్తుల పై అచ్చెన్న కామెంట్స్
వ్యవహారంపై టిడిపి ఏపీ అధ్యక్షుడు వైసిపి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ కూడా దృఢ సంకల్పం తో ఉన్నారని, పొత్తుల పై సరైన సమయంలో సరైన నిర్ణయం ఉంటుందని అచ్చెన్న అన్నారు
8.
తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్ది సాధారణంగా ఉంది.నేడు శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఐదు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.
9.
మహిళ కమిషన్ కు బండి సంజయ్ ప్రశ్న

ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉండడంతో ఢిల్లీలో ఉన్నారు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులపై సంజయ్ స్పందించారు.ఈ మేరకు కమిషన్ కు లేఖ రాశారు .నేడు కమిషన్ ముందుకు హాజరు కావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది వివరణ ఇవ్వాలని, ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో 15 న హాజరు కాలేదని, 18న హాజరు అవుతారని లేఖలో పేర్కొన్నారు.
10.
సండ్ర వీరయ్య పై పెడమర్తి రవి కామెంట్
మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వీరయ్య సంచలన కామెంట్ చేశారు.ఎమ్మెల్యే వీరయ్య చివరి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉంటారనే గ్యారంటీ లేదని విమర్శించారు.
11.
జగన్ కు వీర్రాజు లేఖ

ఏపీ సీఎం జగన్ (CM Jagan)కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు.సాంప్రదాయ వైద్యం పై రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఆసక్తి లేదు అని లేఖలో ప్రశ్నించారు.
12.
పొంగులేటి పై పువ్వాడ విమర్శలు
కెసిఆర్ ముందు నీ పప్పులు ఉడకవని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై మంత్రి పువ్వాడ అజయ్ కామెంట్ చేశారు.
13.
సర్వర్ డౌన్ ఏపీలో డిజిటల్ సేవలకు బ్రేక్

స్టేట్ డేటా సెంటర్ సర్వర్ డౌన్ అయింది.ఎస్టిసి సర్వర్ డౌన్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ సేవలు నిలిచిపోయాయి.
14.
టీ ఎస్ పీ ఎస్సీ కీలక భేటీ
టీ ఎస్ పీ ఎస్సీ పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారంపై చర్చించేందుకు తెలంగాణా పబ్లిక్ కమిషన్ నేడు కీలక సమావేశం నిర్వహిస్తోంది.
15.
ఢిల్లీ లో షర్మిల అరెస్ట్

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఢిల్లీలో ఆరెస్ట్ అయ్యారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి పై జేఏసి వేయాలని, కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని షర్మిల డిమాండ్ చేశారు.
16.
అదనపు పరిహారం కేసులో కేంద్రం పిటిషన్ కొట్టివేత
బోఫాల్ గ్యాస్ లీకేజీ ప్రమాద బాధితులకు అదనపు నష్టపరిహారం చెల్లించాలని కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ ను మంగళవారం సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.
17.
పదో తరగతి పరీక్షల హాల్ టికెట్ ల విడుదల

ఏపీలో ఏప్రిల్ 3 నుంచి జరిగే పదో తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి.ఈ పరీక్షల హాల్ టికెట్ లను ssc తన అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది.
18.
ఏపీ బడ్జెట్ సమావేశాలు
ఏపీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభం అయ్యాయి.
19.
తెలంగాణ ఇంటర్ పరీక్షలు
మార్చి 15 నుంచి తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరుగుతాయి .
20.
ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 53,150
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 57,980
.