రాధేశ్యామ్ రిలీజ్ పోస్టర్.. పర్ఫెక్ట్ అంటున్న ఫ్యాన్స్.. ఆకట్టుకుంటున్న పోస్టర్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.వాటిల్లో రాధేశ్యామ్ ఒకటి.

 New Poster Of Radhe Shyam , Radhe Shyam , Prabhas , Pooja Hegde , Released March-TeluguStop.com

రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.దాదాపు మూడన్నరేళ్ళ తర్వాత డార్లింగ్ బిగ్ స్క్రీన్ మీద కనిపించ బోతున్నాడు.

ఈ సినిమా సంక్రాంతికే రిలీజ్ అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా వేశారు.

ఇక ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకుని ఈ సినిమా మార్చి 11న రిలీజ్ కానున్నట్టు ఇటీవలే ప్రకటించారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి ప్రమోషన్స్ పరంగా వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులకు ఈ సినిమాను మరింత దగ్గర చేసింది.అందులోనే ఇది డిఫెరెంట్ లవ్ స్టోరీ కావడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

ఈ సినిమా 1970 కాలం నటి పీరియాడిక్ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథ.

Telugu Poster, Pooja Hegde, Prabhas, Radhe Shyam, March-Movie

దీనిని యూరప్ లోని హెరిటేజ్ అందాల నేపథ్యంలో డైరెక్టర్ భారీ విజువల్ వండర్ గా తెరకెక్కించాడు.మార్చి 10న అంటే ఈ రోజు పలు దేశాల్లో ప్రీమియర్ షోలు పడబోతున్న నేపథ్యంలో తాజాగా మేకర్స్ ఈ సినిమా నుండి ఒక పోస్టర్ ను విడుదల చేసారు.ఇది అందరిని ఆకట్టు కుంటుంది.

మరికొద్ది గంటల్లోనే విడుదల అవుతున్న ఈ సినిమా ప్రీమియర్స్ స్టార్ట్ కానున్న నేపథ్యంలో టీమ్ నుండి ఒక పర్ఫెక్ట్ పోస్టర్ రిలీజ్ అయ్యింది.

ఈ పోస్టర్ లో ప్రభాస్, పూజా హెగ్డే ఇద్దరు ఒకరి కౌగిలిలో ఒకరు ఉండి నవ్వులు చిందిస్తున్నారు.

ఈ పోస్టర్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటుంది.ఈ సినిమా ప్రేమకి విధికి మధ్య సాగిన కథ అని ఇప్పటికే తెలుస్తుంది.

ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో పామిస్ట్ గా నటించాడు.ఈ మూవీ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube