ఈటీవీ ప్రభాకర్ గురించి మనందరికీ బాగా తెలిసిన విషయమే.దూరదర్శన్ ద్వారా తన కెరియర్ ప్రారంభించి ఆ తరువాత ప్రారంభించబడిన ఈటీవీ, జెమినీ టీవీ, జీ తెలుగు మిగతా ఛానల్స్ లో ఎన్నో సీరియల్స్ లో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు.
ఈటీవీలో ప్రవేశిస్తూనే అనేక సీరియల్స్లో నటిస్తూ ఆ సంస్థ అధినేత అయిన కిరణ్ కి బాగా దగ్గర అయ్యాడు.
ఈటీవీ సంస్థ తనదే అన్న అంత చనువుగా తిరిగేవాడు.
తర్వాత ఏమైందో ఏమో తెలియదు గానీ, ఆ సంస్థ అధినేత రామోజీరావు తో విభేదాలు కారణంగా ఆ సంస్థ నుంచి బయటకు రావలసి వచ్చింది.అయినప్పటికీ పలు మిగతా ఛానెల్స్ లో వచ్చే సీరియల్స్ ద్వారా మంచి పేరు సంపాదించి బుల్లితెర చిరంజీవి గా పేరు తెచ్చుకున్నాడు.
ఆ సమయంలోనే ప్రభాకర్ మలయజ అనే యువతి తో ప్రేమలో పడి, వివాహం చేసుకున్నాడు.
వారికి ముచ్చటైన ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
మరి ఇది కూడా మనందరికీ బాగా సుపరిచితమే.ఆమె ప్రభాకర్ తో కలిసి ఇష్మార్ట్ జోడి లాంటి పలు టీవీ షో ద్వారా మన అందరినీ అలరించారు.
ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించి తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రేక్షకులతో పంచుకుంటారు.ఇక ప్రభాకర్ పిల్లల్లో ఒకరైన దివిజ కూడా పలు టీవీ షో ద్వారా మనకు పరిచయమే.
ఆమె చిన్నప్పటి నుంచి కూడా టీవీ షోస్ చేస్తూ మంచి పేరు సంపాదించుకుంది.ఈమె కేవలం నటన మాత్రమే కాకుండా, చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్, టిక్ టాక్ చేస్తూ మంచి పాపులారిటీని సంపాదించుంకుంది.ఇక ప్రస్తుత విషయానికి వస్తే మలయజ తన యూట్యూబ్ ఛానల్ లో తీసిన బ్లాగ్ వైరల్ అయింది.అది ఏంటంటే మలయజ, హాస్టల్ నుంచి చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చిన దివిజ ను తీసుకొని షాపింగ్ కు వెళ్ళింది.
షాపింగ్ అంతా మలయజ యూట్యూబ్ లో పెట్టింది.అయితే ఆ బ్లాగు చూసిన నెటిజెన్స్ తల్లితో దివిజ మాట్లాడే విధానాన్ని నెటిజన్స్ తప్పుపడుతున్నారు.కుర్తిస్ కొనుక్కోవాలంటే బడాస్ వేసుకుంటారు, నాకు వద్దు అంటూ తల్లితో చెప్పడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.దివిజ, మీ అమ్మ వేసుకున్నది కుర్తి నే చూసుకోలేదా అని కామెంట్లు పెడుతున్నారు.
బయటకు వెళ్ళినప్పుడు అయినా తల్లితో మర్యాదగా ఉండలేవా అంటూ చీవాట్లు పెడుతున్నారు.మీ అమ్మాయి కి ముందు మెనర్స్ నేర్పించండి ప్రభాకర్ అంటూ ప్రభాకర్ మీద సీరియస్ అవుతున్నారు.
మరికొందరు ప్రభాకర్ కూతురు ప్రవర్తన అంత ఘోరంగా ఉందా అని కామెంట్ల ద్వారా తప్పుపడుతున్నారు.మొత్తానికి దివిజ షాపింగ్ ప్రభాకర్ కి తలనొప్పిగా మారింది.
మరి ఈ విషయం గురించి ప్రభాకర్ ఎలా స్పందిస్తాడో.ముఖ్యంగా దివిజ ఎలా స్పందిస్తుందో ఎదురు చూడాలి.