బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సాగుతున్న కొట్లాటలో పాత చరిత్ర కూడా తవ్వి పోస్తున్నారు.పాత తరం జాతీయ నాయకులను ఇప్పటి నాయకులు తమ వివాదాల్లోకి లాగుతున్నారు.
వారిపై బురద చల్లుతూ తమ బుర్రలకు తోచింది మాట్లాడుతున్నారు.ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కాంగ్రెసును బద్నాం చేయడానికి భారత మొదటి ప్రధాని పండిట్ నెహ్రూపై విమర్శలు చేశారు.
ఇప్పటి కాంగ్రెసును విమర్శించడానికి అప్పటి నెహ్రూను ఎందుకు ఉపయోగించుకోవాలి? 1962లో చైనా మన దేశం మీద దండెత్తి యుద్ధం చేసినప్పుడు నెహ్రూ చైనాకు లొంగిపోయారని కేంద్ర మంత్రి సెలవిచ్చారు.ఎవ్వరికీ తెలియని హిస్టరీ లెసన్ చెప్పారు.
అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ దేశాన్ని ఏకం చేశారని, కానీ నెహ్రూ దేశాన్ని చైనాకు స్వాధీనం చేశారని విమర్శించారు.దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత వల్లభాయి పటేల్ 500లకు పైగా సంస్థానాలను ఇండియన్ యూనియన్లో కలిపినా ఆ క్రెడిట్ ఆయనకు దక్కలేదన్నారు.
వల్లభాయి పటేల్ కాంగ్రెస్ నాయకుడైనా ఆయన్ను బీజేపీ నాయకులు సొంతం చేసుకొని రాజకీయాలు చేస్తున్నారు.