గోవా బ్యూటి ఇలియానా మళ్ళీ తెలుగు తెరపై కనిపించనుందా? అవకాశాలు మెండుగా ఉన్నాయి అంటున్నారు సినీవర్గాలు.ఇలియానా నడుము మళ్లీ తెలుగు కుర్రాళ్ళను ఉర్రుతలూగించనుంది అంతా అనుకున్నట్టే జరిగితే.
రామ్ చరణ్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఓ చిత్రం మొదలవబోతున్న విషయం తెలిసిందే.ఇది తమిళ బ్లాక్బస్టర్ తని ఒరువన్ కు రీమేక్ .ఈ చిత్రానికి కథానాయికగా ఇలియానాను పరిశీలిస్తున్నారు.ఇలియానా చరణ్ తో ఇంతవరకు సినిమా చేయకపోగా, సురెందర్ రెడ్డి దర్శకత్వంలో కిక్ సినిమా చేసింది.
ఇలియానా ఆడిపాడిన కిక్ మంచి విజయం సాధించడంతో ఆ సెంటిమెంట్ ని ఫాలో అవుతూ, ఇలియానా పేరుని దర్శకుడే లేవనెత్తినట్టు సమాచారం.అయితే రామ్ చరణ్ ఇంకా దీనిపై నిర్ణయం తీసుకోలేదు.
ఇలియానా క్రేజ్ ఇంకా తగ్గలేదనే చెప్పాలి.ఒకవేళ నిజంగానే ఇల్లి బేబిని తెలుగు తెరపై తీసుకొస్తే ఈ చిత్రం యొక్క ఓపెనింగ్స్ కి తాను లాభపడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.