కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు అట్లీ కుమార్ దర్శకత్వం వహించినటువంటి “రాజా రాణి” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి తన ఎమోషనల్ డైలాగులతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన “కోలీవుడ్ బ్యూటీ నజ్రియ నజీమ్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే తెలుగులో ఈమె ఈ ఒక్క చిత్రంతోనే ఎంతో పాపులారిటీ సంపాదించింది.
అయితే 2014వ సంవత్సరంలో ప్రముఖ నటుడు ఫాహిద్ అలీ ని పెళ్లి చేసుకోవడంతో దాదాపుగా నాలుగు సంవత్సరాలు సినిమాలకి దూరంగా ఉంది.
అయితే ఇంతకీ విషయం ఏంటంటే ఇటీవలే నటి నజ్రియా నజీమ్ మాస్కు ధరించిన ఫోటో ని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ విపత్కర పరిస్థితులను నియంత్రించాలంటే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని అవగాహన కల్పించింది.దీంతో నజ్రియ నజీమ్ చేసినటువంటి ఈ పనికి కొంతమంది నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.
అయితే నజ్రియా నజీమ్ హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా, ప్లేబ్యాక్ సింగర్ గా కూడా బాగానే రాణించింది.కాగా ఇటీవలే నజ్రియా నజీమ్ “ట్రాన్స్” అనే మలయాళం చిత్రంలో నటించింది.
ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.