సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయన తార వరుసగా సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.పెళ్లి అయిన తర్వాత కూడా నయనతార సినిమాల జోష్ తగ్గించలేదు.
ఇటీవలే తల్లిగా కూడా బాధ్యతలను చేపట్టిన నయన తార బాలీవుడ్ లో వరుసగా ఆఫర్స్ సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ హీరో గా తమిళ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వం లో రూపొందుతున్న జవాన్ సినిమా లో కీలక పాత్ర లో నటిస్తున్న విషయం తెలిసిందే.

జవాన్ సినిమా విడుదల తర్వాత హిందీ లో నయన తార చాలా బిజీ అవుతుందని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.ఒక వైపు తమిళం మరియు తెలుగు సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు మరో వైపు హిందీ లో కూడా ఈ సినిమాతో ఇవ్వబోతున్న నేపద్యంలో అక్కడ మరింత బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

గతం లో సౌత్ నుండి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి చాలా మంది సక్సెస్ అయ్యారు.ఇప్పుడు వీరిద్దరు కూడా అక్కడ మంచి విజయాలను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయంటూ నాయన తార మరియు అట్లీ గురించి ప్రచారం జరుగుతుంది.ముఖ్యంగా నయన తార బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.అదే నిజమైతే కచ్చితంగా నయన తార కు అరుదైన రికార్డు సొంతం అయ్యే అవకాశం ఉంది.
సౌత్ లో లేడీ సూపర్ స్టార్ అంటూ గుర్తింపు దక్కించుకుని బాలీవుడ్ లో కూడా సినిమాలు చేసిన హీరోయిన్ ఈమె అవుతుంది.బాలీవుడ్ లో కూడా లేడీ సూపర్ స్టార్ అనే పేరు దక్కించుకుంటే పాన్ ఇండియా లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి.