బీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల శ్రమ దోపిడీకి పాల్పడుతోందన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో గని కార్మికుల పాత్ర ఎంతో ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు.కమీషన్ల కక్కుర్తి కోసం ఓపెన్ కాస్ట్ గనులను ప్రైవేట్ కు కట్టబెడుతున్నారని ఆరోపించారు.
గనులను ప్రైవేట్ కు అప్పగించి దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు.సింగరేణికి జెన్ కో రూ.12 వేల కోట్ల బకాయి పడిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.ఓపెన్ కాస్ట్ మైన్ తో కార్మికులకు ఉపాధి లేకుండా చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దోపిడీకి పాల్పడిన వారిని కటకటాల్లోకి పంపుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు.