దిశ, నిర్భయ వంటి చట్టాలు తీసుకొచ్చినా మహిళలపై ఆఘాయిత్యాలు పెరుగుతునే ఉన్నాయి.నెలల వయసున్న చిన్నారుల నుంచి వృద్ధులపై దారుణాలకు తెగబడుతున్నారు కామాంధులు.
రాజమండ్రిలో బాలికపై సామూహిక అత్యాచార ఘటన మరువక ముందే నెల్లూరులో మరో దారుణం చోటు చేసుకుంది.నెల్లూరులో తొమ్మిదేళ్ల బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచార ఘటనపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు.నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పెద్ద రాజుపాలెంలొ తొమ్మిదేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్ పవన్ కళ్యాణ్ అత్యాచారానికి పాల్పడడం సమాజం తలదించుకునే సంఘటన అన్నారు నారా లోకేష్.వాలంటీర్ల ముసుగులో బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న మృగాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
దిశ చట్టం, 21 రోజుల్లోనే బాధిత మహిళలకు న్యాయం, ప్రత్యేక దిశ పోలీసు స్టేషన్లు అంతా ప్రచార ఆర్భాటమే తప్ప జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణే లేదని నారా లోకేష్ ట్వీట్ చేశారు.వారం వ్యవధిలోనే రెండు అత్యాచార ఘటను జరిగినా ప్రభుత్వం మృగాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడ దారుణమని నారా లోకేష్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు పవన్ కళ్యాణ్ ను అదుపులోకి తీసుకుని నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.