“ 11 ఏళ్లగా ప్రతిరోజూ ఉదయం లేవగానే తలచుకుంటే.నిజమైన ప్రేమను చూపిస్తూ.
నాపట్ల కేరింగ్ తీసుకునే వ్యక్తి దొరికిందని ఆనందపడుతున్నానని… నా జీవితంలో దేవుడు నాకు ప్రసాదించిన మంచి బహుమతి.అందుకు దేవుడికి థ్యాంక్స్ చెబుతున్నానంటూ ట్వీట్ చేశారు మంత్రి లోకేష్.
పెళ్లి రోజు సందర్భంగా బ్రాహ్మణికి శుభాకాంక్షలు తెలుపుతూ లోకేష్ షేర్ చేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగవైరలవుతుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మంత్రి నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ట్విట్టర్ ద్వారానే ప్రజల సమస్యల్ని తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తున్నారు.ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలకు సమాధానం చెబుతున్నారు.
రాజకీయాలే మాత్రమే కాదు.అప్పుడప్పుడు తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను కూడా మంత్రి షేర్ చేసుకుంటున్నారు.తన పెళ్లిరోజు నాడు లోకేష్ షేర్ చేసిన ఫోటో చూసి ఎన్నెన్నో లెక్కల బంధం నీది నాది,కాకి ముక్కుకి దొండపండు అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తుంటే,మా లోకేష్ బాబు తన భార్యని ఇంటికే పరిమితం చేయకుండా,సాధారణ గృహిణిలా ఉంచకుండా తనని తాను ప్రూవ్ చేస్కునేలా చేస్తున్నాడు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
నిజమే ఎంతోమంది నేతలు,హీరోలు వారి భార్యల్ని బయటి ప్రపంచానికి తెలియకుండా,ఇంటి బాద్యతలు చూస్కుంటే చాలన్నట్టుగా చూస్తారు.ఈ విషయంలో లోకేష్ ది బెస్ట్ అని చెప్పొచ్చు.లోకేష్ షేర్ చేసిన ఫోటో చూసి మీరు విష్ చేయండి.
.