తాజాగా ఘట్టమనేని ఇంట్లో ఒక విషాద ఘటన చోటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల గుండెపోటు కారణంగా మరణించిన విషయం మనందరికీ తెలిసిందే.
సూపర్ స్టార్ కృష్ణ మరణంతో ఒక్కసారిగా ఘట్టమనేని ఫ్యామిలీలో విషాదఛాయలు అలముకున్నాయి.ఆయన మరణ వార్తను అభిమానులు అలాగే ఘట్టమనేని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.
అయితే సూపర్ సార్ కృష్ణ ఫ్యామిలీలో కేవలం మహేష్ బాబు ఫ్యామిలీ గురించి మాత్రమే తెలుసు.మిగతా వారి గురించి చాలామందికి తెలియదు.
సూపర్ స్టార్ కృష్ణ కొడుకులు ఆయన రమేష్ బాబు, మహేష్ బాబు గురించి మనందరికీ తెలిసిందే.రమేష్ బాబు ఫ్యామిలీ తో పోల్చుకుంటే మహేష్ బాబు ఫ్యామిలీ అందరికీ బాగా సుపరిచితం.
మహేష్ బాబు తో పాటు భార్య నమ్రత పిల్లలు గౌతమ్ సితారా లు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతో మహేష్ బాబు ఫ్యామిలీ చాలా వరకు బాగా సుపరిచితం.ఇక రమేష్ బాబు ఫ్యామిలీ గురించి చాలామందికి అసలు తెలియదు.
ఇటీవల కృష్ణ మరణించడంతో విదేశాల్లో ఉంటున్న రమేష్ బాబు పిల్లలు హైదరాబాద్ కు వచ్చిన విషయం తెలిసిందే.

ఇక తండ్రి రమేశ్ బాబులానే అందంగా కొడుకు జయకృష్ణ చూడడానికి అచ్చం యంగ్ హీరోల కనిపించడంతో ఘట్టమనేని అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.అలాగే రమేశ్ బాబు కూతురు భారతి కూడా చూడచక్కగా ఉంది.ఇప్పుడు సితార, భారతితో కలిసి తీసుకున్న ఓ ఫొటోని మహేశ్ భార్య నమ్రత ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
ఈ ఇద్దరమ్మాయిల వల్లే ఇంట్లో నవ్వొలొచ్చాయి అంటూ క్యాప్షన్ ను కూడా రాసుకొచ్చింది నమ్రత.ఆ ఫొటోస్ తెగ వైరల్ అవ్వడంతో ఆ ఫొటోస్ పై అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.