అక్కినేని నాగార్జున ఈ ఏడాది ‘మన్మధుడు 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ సినిమా వచ్చి మూడు నెలలు గడిచి పోయింది.
ఇప్పటి వరకు కూడా ఈయన తదుపరి చిత్రం విషయంలో ఒక నిర్ణయానికి రాలేదు.ఇక మన్మధుడు 2 చిత్రం షూటింగ్ సమయంలోనే బంగార్రాజు చిత్రం గురించి వార్తలు వచ్చాయి.
దర్శకుడు కళ్యాణ్ కృష్ణ స్క్రిప్ట్ పూర్తి చేశాడని అతి త్వరలోనే ప్రారంభించి సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తామంటూ చాలా నమ్మకంగా చెప్పారు.
బంగార్రాజు విడుదల చాలా నెలలు అయ్యింది.
బిగ్‌బాస్ పూర్తి అయిన తర్వాత అయినా సినిమా స్టార్ట్ చేస్తాడేమో అంటే ఇంకా కూడా ఆ ఆలోచన ఉన్నట్లుగా నాగార్జున ప్రవర్తించడం లేదు.దీంతో నాగార్జున బంగార్రాజును కూడా పక్కకు పెట్టాడేమో అను అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇటీవల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఒక యువ హీరోను కలిసి స్టోరీ వినిపించాడట.దాంతో బంగార్రాజు సినిమా ఉండటం అనుమానమే అంటూ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మరో వైపు అసలు నాగార్జున సినిమా చేసే ఉద్దేశ్యంలో ఉన్నాడా లేడా అంటూ కొందరు ఇష్టానుసారంగా ప్రచారం చేస్తున్నారు.నాగార్జున ఇక సినిమాలకు గుడ్ బై చెప్తాడని, ఆయన ఇద్దరు కొడుకులు హీరోలుగా ఉన్న కారణంగా హీరోగా సినిమాలు చేసే ఆలోచనను విరమించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.నాగార్జున హీరోగా ఎన్నో సినిమాలు చేశాడు.అయిదు పదుల వయసులో కూడా సూపర్ హిట్స్‌ను అందుకున్నాడు.కాని నాగార్జున గత కొంత కాలంగా నిరాశ పర్చుతున్నాడు.సినిమాలు ఫ్లాప్ అవుతున్న కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాలకు గుడ్ బై చెప్తాడా ఏంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.