ఆ విషయంలో చైతన్య, సమంతకు పోలికే లేదట..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా సమంత, నాగచైతన్య పేరు తెచ్చుకున్నారు.2017 సంవత్సరం అక్టోబర్ నెల 7వ తేదీన సమంత, చైతన్యల వివాహం జరగగా పెళ్లి తరువాత కూడా ఈ జంట సినిమాల్లో నటిస్తున్నారు.పెళ్లి తర్వాత చైతన్య, సమంతల కాంబినేషన్ లో తెరకెక్కిన మజిలీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైంది.వీళ్లిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తున్నట్టు కొన్ని నెలల క్రితం వార్తలు వచ్చినా ఆ వార్తలు నిజం కాలేదు.

 Nagachaitanya Samantha Social Media Active Ness,tollywood,samantha,nagachaitany-TeluguStop.com
Telugu Majili, Nagachaitanya, Sam Jam Show, Samantha, Activeness-Movie

అయితే సమంత ఆహా ఓటీటీ షో హోస్ట్ చేయగా ఆ షో చివరి ఎపిసోడ్ కు నాగ చైతన్య గెస్ట్ గా వచ్చారు.ఆ సమయంలో చైతన్య, సమంత తమ మధ్య ఉన్న పోలికలు, బేధాల గురించి చెప్పగా ఆ ముచ్చట్లు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న సమంత, చైతన్య కొన్ని విషయాల్లో మాత్రం పూర్తి భిన్నంగా ఉంటారని తెలుస్తోంది.సోషల్ మీడియాలో సమంత యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.

సోషల్ మీడియా పోస్టుల ద్వారా అనేక విశేషాలను సమంత అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.అయితే నాగ చైతన్య మాత్రం సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండరు.

సమంత సోషల్ మీడియా పోస్టుల గురించి చెబుతూ తాను ఒక్కరోజులో ఎన్ని పోస్టులు చేస్తానో చైతన్య సంవత్సరం అంతటా అన్ని పోస్టులు చేస్తాడని చెప్పుకొచ్చారు.సోషల్ మీడియాకు ఎందుకు దూరంగా ఉంటావో అభిమానులకు చెప్పాలని ఆమె అన్నారు.

ఆ ప్రశ్నకు వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్ చేయడం తనకు ఇష్టం ఉండదని తను చాలా రిజర్వ్డ్ అని చైతన్య తెలిపారు.అదే సమయంలో చైతన్య కూడా ప్రతి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడానికి కారణం చెప్పాలని అడగగా సినిమాల్లో కనిపించేది తాను కానని నిజమైన సమంత అభిమానులకు తెలియడం కొరకు తాను ఆ విధంగా చేస్తానని సామ్ చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube