స్టార్ హీరో ప్రభాస్ హీరోగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్ లో రాధేశ్యామ్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.కొన్ని సన్నివేశాలు మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల కాలేదు.
ఈ ఏడాది సెకండాఫ్ లో వస్తున్న సినిమాలకు సంబంధించిన టీజర్లు సైతం విడుదల కాగా రాధేశ్యామ్ టీజర్ విడుదల కాకపోవడంపై ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు.
అయితే రాధేశ్యామ్ టీజర్ ఆలస్యం కావడం వెనుక అసలు కారణం వేరే ఉందని ఫిబ్రవరి రెండవ వారంలో రాధేశ్యామ్ టీజర్ విడుదల కానుందని తెలుస్తోంది.
ప్రభాస్ గత సినిమా సాహో తెలుగులో ఫ్లాప్ కావడంతో ప్రభాస్ అభిమానులు రాధేశ్యామ్ సినిమా ఫలితం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.సంక్రాంతికి టీజర్ వస్తుందని ఆశించిన అభిమానులకు నిరాశే మిగలగా రాధేశ్యామ్ యూనిట్ టీజర్ కోసం సిద్ధం చేసిన వీడియో క్లిప్ ప్రభాస్ కు పెద్దగా నచ్చలేదని తెలుస్తోంది.
టీజర్ లో మార్పుల వల్ల ఆలస్యం జరుగుతోందని.ఫిబ్రవరి 14వ తేదీన టీజర్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.టీజర్ లోనే సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉందని సమాచారం.మరోవైపు రాధేశ్యామ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది.
అయితే వాలంటైన్స్ డే రోజునైనా టీజర్ విడుదలవుతుందో లేదో చూడాల్సి ఉంది.
మరోవైపు ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమాల్లో నటిస్తున్నారు.
సలార్ సినిమా ఈ ఏడాది సెకండాఫ్ లో లేదా 2022 సంక్రాంతి పండుగకు విడుదల కానుంది.ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్, సలార్ సినిమాలు తక్కువ గ్యాప్ లో విడుదల కానున్నాయని సమాచారం.