ఒకప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ కేవలం రామ్ గోపాల్ వర్మ మాత్రమే ఉండేవాడు.కాని ఇప్పుడు టాలీవుడ్‌లో చాలా మంది తయారు అయ్యారు.
అందులో ఒకడే నాగబాబు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.తనకంటూ ఒక యూట్యూబ్ ఛానెల్‌ను ఏర్పాటు చేసి మరీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
నాగబాబుకు రామ్‌గోపాల్ వర్మ అంటే ఎంతటి కోపం ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.రామ్ గోపాల్ వర్మపై గతంలో పలు సార్లు నాగబాబు విరుచుకు పడ్డాడు.
రామ్ గోపాల్ వర్మ వర్సెస్ నాగబాబు అన్నట్లుగా వివాదం సాగింది.అంతటి వివాదంలో ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు.రామ్ గోపాల్ వర్మను వెదవ అంటూ నాగబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.అయితే తాజాగా వర్మ విషయంలో ఆయన కాస్త వాయిస్ మారినట్లుగా అనిపిస్తుంది.
నాగబాబు తాజాగా ఒక వెబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

వర్మ అంటే నాకు గౌరవం లేదు, కాని ఆయనను తాను ఒక దర్శకుడిగా ఎప్పుడు గౌరవిస్తాను.దర్శకుడిగా ఆయన ఎన్ని ఫ్లాప్‌లు తీసినా కూడా దర్శకుడిగా ఆయన్ను నేను గ్రేట్ అంటాను.ఎందుకంటే ఆయన మంచి సినిమాలు చాలా తీశాడు.
ఆయన ఒక గ్రేట్ దర్శకుడిగా ముద్ర పడిపోయాడు.తాజాగా ఆయన తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ కూడా తప్పకుండా బాగుంటుందని, అలాంటి సినిమా తీయగలిగే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు.
అలాంటి వారిలో వర్మ ఒకడు అంటూ నాగబాబు వ్యాఖ్యలు చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.