మైనంపల్లి హనుమంతరావు ( Mynampally Hanumanth Rao )ఇటీవల కాంగ్రెస్( Congress ) గూటికి చేరిన సంగతి తెలిసిందే.మల్కాజ్ గిరి టికెట్ బిఆర్‌ఎస్ నుంచి లభించినప్పటికి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు.
దీనికి కారణం మేదక్ టికెట్ తన కుమారుడికి ఆశించగా బిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ నిరాకరించారు.ఒకే కుటుంబంలో ఇద్దరికి సీటు ఇవ్వడం కుదరని కేసిఆర్ చెప్పడంతో ఆయన బిఆర్‌ఎస్ తో తెగతెంపులు చేసుకొని హస్తం పార్టీలో ఇటీవల చేరారు.
అయితే మైనంపల్లి కాంగ్రెస్ లో చేరిన తరువాత కొత్త చిక్కు మొదలైంది.ఆయనకు మల్కాజ్ గిరి టికెట్ ఇవ్వరాదని ఆ నియోజిక వర్గ కార్యకర్తలు ఏకంగా రాహుల్ గాంధీ( Rahul Gandhi )కి ట్విట్ల వర్షం కురిపిస్తున్నారు.

మల్కాజ్ రిగి బరిలో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న నందికంటి శ్రీదర్( Nandhikanti Sridhar ) కు టికెట్ ఇవ్వాలని, మైనంపల్లికి టికెట్ ఇవ్వరాదని కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.ఇదే ఇప్పుడు హస్తం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది.ఎందుకంటే మైనంపల్లికి మరియు ఆయన కుమారుడికి టికెట్లు కన్ఫమ్ అయిన తరువాతనే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారనే ప్రచారం జరుగుతోంది.ఇప్పుడు మైనంపల్లికి వ్యతిరేకంగా సొంత పార్టీ కార్యకర్తలే దిక్కర స్వరం వినిపిస్తుండడంతో మల్కాజ్ గిరి టికెట్ విషయంలో కాంగ్రెస్ కన్ఫ్యూజన్ లో పడిందట.
ఈ నియోజిక వర్గంలో మైనంపల్లికి మంచి పట్టు ఉంది.

బిఆర్‌ఎస్ పై వ్యతిరేక స్వరం వినిపించినప్పటికి మైనంపల్లికే టికెట్ కేటాయించారు గులాబీ బాస్.అయినప్పటికి మైనమపల్లి పార్టీ విడారు.కాగా కాంగ్రెస్ చేయించిన అంతర్గత సర్వేలలో నందికంటి శ్రీదర్ కొంత వెనుకంజలోనే ఉన్నట్లు టాక్.
పైగా మైనంపల్లి స్థానాన్ని భర్తీ చేసేందుకు మల్కాజ్ గిరిలో మర్రి రాజశేఖర్ రెడ్డి( Marri Rajasekhar Reddy )ని బరిలో దించబోతున్నాట్లు టాక్.గత ఎన్నికల్లో స్వల్ప ఓటమిపాలు అయిన మర్రి రాజశేఖర్ రెడ్డి ఈసారి విజయం పక్కా అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
దాంతో బిఆర్‌ఎస్ అభ్యర్థిని ఎదుర్కోవాలంటే మైనంపల్లికి టికెట్ కేటాయించామే మేలని హస్తం పార్టీ అగ్రనేతలు భావిస్తున్నాట.కానీ నియోజిక వర్గంలో మైనంపల్లికి టికెట్ కేటాయించరాదని సొంత పార్టీ కార్యకర్లే వ్యతిరేకత చూపుతుండడంతో చివరికి మల్కాజ్ గిరి టికెట్ ఎవరికి కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది.