ఏపీలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే.గత కొన్నాళ్లుగా లెక్కకు మించి స్కామ్ లు ఆ పార్టీ అధినేతలను చుట్టుముడుతున్నాయి.
ఇప్పటికే చంద్రబాబు స్కిల్ స్కామ్( Chandrababu skill scam ) లో దోషిగా రిమాండ్ లో ఉన్నారు.ఆయన ఎప్పుడు బయటకు వస్తారో కూడా క్లారిటీ లేదు.
అదొక్కటే కాకుండా ఇంకా పలు స్కామ్ లు చంద్రబాబు చుట్టూ తిరుతున్నాయి.ఇక ఇప్పుడు లోకేష్ టార్గెట్ గా వైసీపీ( YCP ) ప్రభుత్వం వ్యూహాలను రెడీ చేస్తున్నాట్లు తెలుస్తోంది.
లోకేష్ ను కూడా జైలు బాటా పట్టిస్తే టీడీపీ పనైపోయినట్లెనని ఆపరేషన్ లోకేష్ వ్యూహానికి తెర తీసింది.
ఫైబర్ గ్రిడ్ స్కామ్( AP Fiber Grid Scam ) లోనూ అలాగే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లోనూ లోకేష్ పాత్ర ఉందాని సిఐడి ఆరోపిస్తూ వచ్చింది.కానీ ఎవరు ఊహించని విధంగా అమరావతి రింగ్ రోడ్ స్కామ్ లో లోకేష్ ను ఏ14 నిందితుడిగా పరిగణించింది.దీంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి ఈ స్కామ్ లో తనను అనసవరంగా ఇరికిస్తున్నారని లోకేష్ ఆరోపిస్తూనే.
ముందస్తు బెయిల్ కు హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.కాగా ముందస్తు బెయిల్ కు హైకోర్టు నిరాకరించడంతో పాటు సీఐడీ విచారణకు హాజరు కావాలని సూచించింది.
దీంతో లోకేష్ ను నోటీసులు జారీ చేసేందుకు డైరెక్ట్ గా డిల్లీ బయలుదేరింది సీఐడీ.ఈ పరిణామాలు చూస్తుంటే లోకేష్ అరెస్ట్ దాదాపు ఖాయమే అని తెలుస్తోంది.ఒకవేళ లోకేష్ అరెస్ట్ అయితే ఇక టీడీపీ కోలుకోవడం కష్టమే అనే వాదన బలంగా వినిపిస్తోంది.కానీ చంద్రబాబు నాయుడుని అలాగే లోకేష్ ను అక్రమంగా అరెస్ట్ చేశారనే సానుభూతి లభిస్తుందని టీడీపీ భావిస్తున్నప్పటికి, సానుభూతి పెద్దగా వర్కౌట్ అయ్యే అవకాశాలు కూడా తక్కువే అని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.
ఎందుకంటే ఇప్పటివరకు బయటపడ్డ స్కామ్ లకు సంబంధించి పక్కా ఆధారాలను సీఐడీ చూపిస్తుండడంతో ఈ పరిణామాలు టీడీపీకి ప్రతికూలంగాణే మారతాయనేది కొందరి అభిప్రాయం.మొత్తానికి తాజా పరిణామాలు చూస్తుంటే లోకేష్ కూడా జైలు బాటాపట్టడం గ్యారెంటీ అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి
.