Tollywood Heros: ప్లాప్ వచ్చిన కూడా అదిరిపోయే ప్రీరిలీజ్ బిజినెస్ చేస్తున్న హీరోలు వీరే !

పాత సినిమాలు ప్లాప్ అయితే ఏంటి హిట్ అయితే ఏంటి ? ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం సినిమా బిజినెస్ చేయాల్సిందే అంటున్నారు మన టాలీవుడ్ యంగ్ హీరోలు. సినిమా ఫలితం తో సంబంధం లేదు.

 Flop Heros Good Pre Release Businesses Ram Pothineni Vijay Devarakonda Nani-TeluguStop.com

ఎలా ఉన్న కూడా ఇప్పుడు తీస్తున్న సినిమ ఏంటి, కథ ఏంటి , మిగతా విషయాలు ఎంత బాగా ఉన్నాయో మాత్రమే చూసుకోండి అంటూ ఖరాకండిగా చెప్తున్నారు.అందుకే ఏమో కానీ ప్రస్తుతం ప్లాప్స్ పడిన సినిమాలు సైతం మంచి ప్రీరిలీజ్ బిజినెస్( Pre-Release Business ) జరుపుకుంటూ ఉన్నాయ్.మరి ఆ ప్లాప్ సినిమాలు ఎవరు, ఫ్రీరిలీజ్ బిజినెస్ అదరగొట్టిన ఆ చిత్రాలు ఏంటో ఒకసారి ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

రామ్ పోతినేని

Telugu Dasara, Flop Heros, Heor Nani, Kushi, Liger, Pre Businesses, Ram Pothinen

స్కంద సినిమా తో( Skanda Movie ) బోయపాటి దర్శకత్వం లో హీరో నటించి పర్వాలేదు అనిపించుకున్న హీరో రామ్ పోతినేని.( Ram Pothineni ) ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిచగా సినిమా టాక్ బాగానే ఉంది అని తెలుస్తుంది.ఇక ఈ సినిమాకు ముందు రామ్ రెండు ప్లాప్ సినిమాల్లో నటించాడు.

ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ జోష్ లో రెడ్ మరియు ది వారియర్ సినిమాల్లో నటించిన ఈ రెండు సినిమా లు బాక్స్ ఆఫీస్ ముందు బోల్తా కొట్టాయి.అయినా కూడా స్కంద సినిమాకు మాత్రం 50 కోట్లకు పైగానే ఫ్రీరిలీజ్ బిజినెస్ జరిగింది.

విజయ్ దేవరకొండ

Telugu Dasara, Flop Heros, Heor Nani, Kushi, Liger, Pre Businesses, Ram Pothinen

లైగర్ సినిమాతో లేవలేనంత బరువును, ప్లాప్ ను మూటగట్టుకున్నాడు విజయ్ దేవరకొండ.( Vijay Devarakonda ) ఈ సినిమా బిజినెస్ బ్రహ్మాండంగా సాగింది.కానీ పరాజయం మాత్రం దారుణమైన ఎఫెక్ట్ ని చూపిస్తుంది అని అందరు అనుకున్నారు.అయినా కూడా అందరి అంచనాలను తారు మారు చేస్తూ విజయ్ ఖుషి సినిమాకు( Kushi Movie ) గాను 55 కోట్ల ఫ్రీరిలీజ్ బిజినెస్ చేసి తన స్టామినా ఏంటో చూపించాడు.

నాని

Telugu Dasara, Flop Heros, Heor Nani, Kushi, Liger, Pre Businesses, Ram Pothinen

దసరా సినిమా విజయాన్ని సాధించడానికి ముందు అంటే సుందరానికి అనే ఒక ప్లాప్ సినిమా పడింది నాని కి.( Nani ) శ్యాం సింగ రాయ్ హిట్ ఇచ్చిన బూస్ట్ తో ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుంది అని అంచనా వేసిన ఎక్కడో జనాలు అది తప్పు అని నిరూపించారు.అయినా కూడా నాని అంటే మినిమమ్ గ్యారంటీ హీరో అనే నమ్మకం తో దసరా కు( Dasara Movie ) సైతం 50 కోట్లకు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఇచ్చారు.దాంతో లాభాల బాట కూడా పట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube