బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆలియా భట్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.
ఇక ఈ సినిమా తర్వాత అలియా భట్ నటించిన బ్రహ్మాస్త్ర సినిమా కూడా తెలుగులో విడుదల అయ్యి మంచి విజయం సొంతం చేసుకుంది.ఇలా నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అలియా భట్ ప్రస్తుతం తల్లిగా తన మాతృత్వపు క్షణాలను ఆస్వాదిస్తున్న విషయం మనకు తెలిసిందే.
ఈమె నటుడు రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు అయితే పెళ్లయిన ఏడు నెలలకే పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.ఇలా కూతురు పుట్టిన తర్వాత తాను కమిట్ అయిన సినిమాల నుంచి కాస్త విరామం తీసుకుని పూర్తిగా తన సమయాన్ని తన కూతురికే కేటాయిస్తూ ఉన్నారు.అయితే త్వరలోనే ఆలియా భట్ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలపై అలియా భట్ స్పందిస్తూ తాను త్వరలోనే తాను సినిమాలలోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
తనకు తన కుమార్తె రాహా పుట్టిన తర్వాత తన ప్రియారిటీస్ మొత్తం మారిపోయాయని తెలిపారు.ప్రస్తుతం తనకు తన కూతురికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నానని నా కూతురు తర్వాతే మిగతావి.నాకు నా కూతురే ఎక్కువ అంటూ తెలిపారు.
అయితే కూతురు విషయంలో కూడా ఈమె నేటిజన్స్,మీడియాకు కొన్ని కండిషన్లు పెట్టారు.ఈ క్రమంలోనే తన కుమార్తెకు రెండు సంవత్సరాల వయసు వచ్చేవరకు దయచేసి తన కుమార్తె ఫోటోలను ఎవరు తీయడానికి ప్రయత్నం చేయవద్దు అంటూ ఈ సందర్భంగా ఈమె తన కూతురి విషయంలో పెట్టినటువంటి ఈ కండిషన్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.